Telugu

డీఎస్సీ రచ్చ పెద్దల సభ చిన్నబోయిందా.?

డీఎస్సి లో అక్రమాలు అంటూ గత కొద్దీ రోజులుగా వైసీపీ చేస్తున్న వీధి పోరాటాలు నేడు శాసనమండలి కి చేరుకున్నాయి. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తే కానీ అసెంబ్లీ రాను అంటూ మొండిగా వాదిస్తున్న వైఎస్ జగన్ ఈ సారి అసెంబ్లీ సమావేశాలకు కూడా గైర్హాజరయ్యారు.

అయితే శాసనమండలి లో మాత్రం వైసీపీ తరుపున గళం వినిపించేందుకు బొత్స సత్యనారాయణ నాయకత్వంలో ఆ పార్టీ నేతలు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే వైసీపీ డీఎస్సి ఉద్యోగ నియామకాలలో కూటమి ప్రభుత్వం అక్రమాలకు పాల్పడిందని, అర్హతా లేని వారికీ ఉద్యోగాలు కల్పించిందంటూ తమ వాదన వినిపించింది.

ADVERTISEMENT

అయితే ఈ క్రమంలోనే అధికార టీడీపీ – విపక్ష వైసీపీ నేతల మధ్య మాటలు హద్దులు దాటాయి. డీఎస్సి పరీక్షలు కూడా సమర్ధవంతంగా నిర్వహించలేని అసమర్ధ మంత్రి నారా లోకేష్ అంటూ బొత్స లోకేష్ టార్గెట్ గా విమర్శలు ఎక్కుపెట్టగా అందుకు ప్రతి స్పందనగా మంత్రి అచ్చెన్ననాయుడు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కనీసం ఒక్క డిఎస్సి అయినా మీరు నిర్వహించారా.? అంటూ కథం తొక్కారు.

అసలు డిఎస్సి నియామకాల మీద మాట్లాడే కనీస హక్కు కూడా వైసీపీ కి లేదంటూ అచ్చెన్న బొత్స పై ఎదురుదాడికి దిగారు. ఈ క్రమంలోనే ఒకరి పై మరొకరు దద్దమ్మ అంటూ ఎద్దు అంటూ చౌకబారు విమర్శలకు దిగుతూ పెద్దల సభను చిన్నబుచ్చారు.

ఎద్దు లా పెరిగితే సరిపోదు…మనిషిలా భాష బాగుండాలి అంటూ బొత్స వ్యాఖ్యానించగా మీ వైసీపీ ప్రభుత్వ హయాంలో విద్యా శాఖ మంత్రి ఉండి కనీసం ఒక్క డీఎస్సి కూడా నిర్వహించలేని దద్దమ్మ నువ్వు అంటూ అచ్చెన్న బొత్స టార్గెట్ గా రెచ్చిపోయారు.

అయితే అధికార – విపక్షాల మధ్య ఈ రకమైన పదప్రయోగాలు, రాజకీయ విమర్శలు ఎప్పటికి ప్రజామోదం పొందలేవని గత వైసీపీ ఎన్నికల ఫలితాలు చూస్తే యిట్టె అర్ధమవుతుంది. కాబట్టి రాజకీయ నేతలు ముఖ్యంగా చట్ట సభలలో వ్యవహరించే తీరు, ప్రత్యర్థుల పై చేసే విమర్శల విషయంలో హుందాతనాన్ని పాటించాలే తప్ప దిగజారుడు తనాన్ని ప్రోత్సహించరాదు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Recent Posts

Box Office: A Disaster Weekend @ Tollywood

The Telugu box office is usually explosive in nature when there is an interesting film…

21 minutes ago

రెడ్డి గారి మద్దతుతో బీసీ-సీఎం…అసందర్భమమైన ప్రకటనా.?

తెలంగాణ కాంగ్రెస్ నాయకుల తీరు చూస్తే కూర్చున్న కొమ్మనే నరుక్కునే రీతిలో కనిపిస్తుంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ తెలంగాణలో…

30 minutes ago