
ఆంధ్రప్రదేశ్‌లో జగన్ నేతృత్వంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు నిత్యం మీడియాలో ఏం మాటలు, వార్తలు వినిపించేవో అందరికీ తెలుసు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటికి పూర్తి విరుద్ధంగా నిత్యం రాష్ట్రంలో పరిశ్రమలు, ఐటి కంపెనీల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల గురించి వార్తలు వినపడుతున్నయిప్పుడు. రాష్ట్రంలో వివిధ జిల్లాలలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి వార్తలు వినబడుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో జరుగుతున్న పనుల గురించి వార్తలు వినిపిస్తున్నాయి. కళ్ళ ముందు సాక్షాత్కరించబోతున్న దివ్యమైన అమరావతి, భోగాపురం వద్ద ప్రారంభోత్సవానికి సిద్దం అవుతున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఫోటోలు, వీడియోలు కనిపిస్తున్నాయి.
కూటమి ప్రభుత్వం అధికార సభలలో, మీడియా సమావేశాలలో సిఎం చంద్రబాబు నాయుడు మొదలు ఎమ్మెల్యేల వరకు హుందాగా మాట్లాడే మాటలు వింటున్నాము. పరదాలు లేకుండా సిఎం, డెప్యూటీ సిఎం, మంత్రులు, ఎమ్మెల్యేలను ప్రజల మద్యన చూస్తున్నాం.
ప్రభుత్వం మారగానే కేవలం రెండేళ్ళ ఇంత మార్పా? మూడు రాజధానులు లేకపోయినా ఎలా సాధ్యం? అంటే సాధ్యమే అని నిరూపిస్తున్నారు సిఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్.
నేడు తిరుపతి జిల్లా శ్రీ సిటీలో ప్రముఖ అంతర్జాతీయ సంస్థ కెరియర్ గ్లోబల్ కార్పోరేషన్ శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఎయిర్ కండిషనర్స్ తయారీలో అంతర్జాతీయంగా పేరొందిన ‘కెరియర్’ రూ.1,000 కోట్ల పెట్టుబడితో శ్రీ సిటీలో పరిశ్రమ ఏర్పాటు చేయబోతోంది.
దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం 39 ఎకరాలు కేటాయించింది. దీనిలో అన్ని రకాల ఏసీలు తయారుచేసి దేశ విదేశాలకు ఎగుమతి చేస్తారు. వచ్చే ఏడాదిలోగా నిర్మాణ పనులన్నీ పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2028 నాటికి పూర్తి సామర్ధ్యంతో ఏసీల తయారీ ప్రారంభమైతే 3,000 మందికి పైగా ప్రత్యక్షంగా దీనిలో ఉద్యోగాలు లభిస్తాయని మంత్రి నారా లోకేష్ తెలిపారు.
తమ ప్రభుత్వం ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ నుంచి ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’కి మారిందనన్నారు. అప్పటి నుంచి పరిశ్రమలకు ఒప్పందాలు, అనుమతులు, భూకేటాయింపులు, రాయితీలు లేదా ప్రోత్సాహకాల విషయంలో శరవేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు. ఆన్‌లైన్‌లో జూమ్ మీటింగ్స్ ద్వారానే అనేక కంపెనీలతో మాట్లాడి ఏపీకి రప్పిస్తుండటమే దీనికి చక్కటి నిదర్శనమన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో ఎన్డీయే ప్రభుత్వాలే ఉన్నందున మరింత వేగంగా పనులు జరుగుతున్నాయని మంత్రి నారా లోకేష్.
Venkatesh’s much-hyped Aadarsha Kutumbam AK 47, directed by Trivikram, has been indefinitely postponed. Producer Naga…
The Ministry of External Affairs in India has amended the passport rules for minors of…