Telugu

డీఎస్సీ ఏడ్పులు పూర్తవనే లేదు అప్పుడే ఏపీపీఎస్సీ అంటే ఎలా?

నేటికీ వైసీపీ ‘డీఎస్సీలో అవకతవకలు’ పాట పాడుతూనే ఉంది. కానీ కూటమి ప్రభుత్వం ‘మీ ఏడ్పులే మాకు దీవెనలు’ అన్నట్లు ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదల చేసింది.

అసలే డీఎస్సీకి, ఏపీపీఎస్సీ తేడా తెలియక వైసీపీ తికమక పడుతుంటే, దాన్ని మరింత అయోమాయానికి గురి చేస్తూ, ఏపీపీఎస్సీ ఒకేసారి 20 శాఖలలో 892 పోస్టుల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు జారీ చేయడం ఖచ్చితంగా పెద్ద కుట్రే.. కదా? వైసీపీని బద్నాం చేయడానికే (పరువు తీయడానికే) కూటమి ప్రభుత్వం ఈ సరికొత్త కుట్రకు సిద్దమవుతున్నట్లు డౌట్ కొడుతోంది.

ADVERTISEMENT

లేకుంటే ఈ ఉద్యోగాలకు వయో పరిమితిని ఒకేసారి పదేళ్ళకు పెంచడం ఏమిటి? వెనువెంటనే ఒకేసారి ఇన్ని ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు జారీ చేయడం ఏమిటి? ఏమంటే జాబ్ క్యాలండర్‌ని చూపిస్తుంటారు.

మళ్ళీ వీటిలో గ్రూప్-1 ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్‌ ఇవ్వడం ఖచ్చితంగా కుట్రే… నో డౌట్. ఎందుకంటే నాడు వైసీపీ హయంలో భవానీ ఐల్యాండ్‌లో ‘అత్యంత పకడ్బందీగా’ మూల్యాంకనం చేయించినా హైకోర్టు ఒప్పుకోలేదు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఎలా చేస్తుందో? మేమూ చూస్తాం! అనుకుంటే తప్పేమిటి?

సరే… తాంబూలాలు ఇచ్చేశాము తన్నుకు చావండి అన్నట్లు డీఎస్సీ… సారీ.. ఏపీపీఎస్సీ నోటిఫికేషన్స్ ఇచ్చేసింది. కనుక ఓసారి భూతద్దంతో ఆ వివరాలు చూదామ్ము. కోడి గుడ్డుకు ఈకలు ఉండకపోతాయా?

ఎన్విరాన్‌మెంట్ గ్రేడ్‌-2 పోస్టులు(పోల్యూషన్ కంట్రోల్ బోర్డు), అసిస్టెంట్ డైరెక్టర్ ట్రైబల్ వెల్ఫేర్-1, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్-12, అసిస్టెంట్ డైరెక్టర్ ఏపీ ఎకనామిక్ అండ్ స్టాటిస్టికల్ సర్వీసెస్- 17 పోస్టులు.

హాస్పిటల్ వెల్ఫేర్ ఆఫీసర్ (గ్రేడ్‌-2)- 73 పోస్టులు, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్-196, అసిస్టెంట్ ఇంజనీర్లు-196, తెలుగు రిపోర్టర్లు- 11(శాసనసభ), అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్-17, అసిస్టెంట్ డైరెక్టర్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ సర్వీసెస్-8, హార్టికల్చర్ ఆఫీసర్- 37 పోస్టులు.

గ్రూప్-1 ఉద్యోగాలు: డిప్యూటీ కలెక్టర్లు-11, ట్యాక్స్ సర్వీసెస్ అసిస్టెంట్ కమిషనర్లు-14, డీఎస్పీ సివిల్-36, డీఎస్పీ కమ్యూనికేషన్స్-3, డీఎఫ్ఓలు-14, ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్-1, ఆర్డీవోలు-3, డిప్యూటీ రిజిస్ట్రార్ కోఆపరేటివ్ సర్వీసెస్-15 , మున్సిపల్ కమిషనర్ (గ్రేడ్‌-2)- 12, అసిస్టెంట్ ట్రైబల్ ఆఫీసర్-2, డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసర్-3, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్-14, డివిజనల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్-35 పోస్టులకు నోటిఫికేషన్స్ వెలువడ్డాయి.

ఈ ఉద్యోగాలకు అక్టోబర్ 6 నుంచి 27 వరకు దరఖాస్తుల స్వీకరణ జరుగుతుంది. పూర్తి వివరాలకు డీఎస్సీ.. మళ్ళీ సారీ.. ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Ranabaali Is Not Moving? Latest Update Is Clear

Vijay Deverakonda and Rashmika Mandanna’s Ranabaali is moving ahead with its October 16 release, and…

11 minutes ago

Sundeep Kishan Taking Telugu Audience for Granted?

Sundeep Kishan needs the Telugu audience more than ever. But the promotional push for Sigma…

40 minutes ago