అరవింద “అతిధి” బాలకృష్ణ… హీట్ ఆన్..!

Jr-NTRనందమూరి అభిమానులు పండగ చేసుకునే ఓ వార్త బయటకు వచ్చింది. యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఎన్నాళ్ళుగానో ఎదురుచూస్తోన్న వేడుక ఈ ఆదివారం నాడు శిల్పకళావేదికలో జరగబోతోంది. జూనియర్ ఎన్టీఆర్ సినీ వేడుకకు నందమూరి నటసింహం బాలకృష్ణ ముఖ్య అతిధిగా విచ్చేస్తుండడం, ఈ వేదికను మరింత స్పెషల్ గా మార్చేసింది.

[m9ad]

ADVERTISEMENT

హరికృష్ణ మరణం తర్వాత నందమూరి కుటుంబంలో ఏర్పడిన పరిణామాల నేపధ్యంలో… ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కే బాలయ్య వస్తారని అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ ముఖ్య అతిధి ఎవరూ లేకుండా, కేవలం చిత్ర యూనిట్ సభ్యులు మాత్రమే సదరు ఈవెంట్ ను జరుపుకున్నారు. కానీ ఇపుడు విడుదల తర్వాత సక్సెస్ మీట్ ను గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు.

ఇందులో బాలకృష్ణ భాగస్వామి అవుతున్నారన్న వార్త సర్వత్రా ఆసక్తిని పెంచింది. ‘తన తండ్రి స్థానంలో బాబాయ్ ఉన్నారని’ జూనియర్ ఎన్టీఆర్ చెప్పడం ఊహించదగినదే అయినా, బాలయ్య స్పందన ఎలా ఉంటుందా? ఒక్క సినీ వర్గాలకే కాదు, రాజకీయంగా కూడా ఎంతో ప్రాధాన్యతను దక్కించుకునేలా చేసింది.

ADVERTISEMENT
Latest Stories