జూనియర్ ఎన్టీఆర్ హీరోగా విడుదలైన “అరవింద సమేత వీర రాఘవ” విజయవంతంగా ధియేటర్లలో ప్రదర్శింపబడుతోంది. ఈ సినిమాతో ఏ తెలుగు హీరోకూ సాధ్యం కాని ఓ అరుదైన రికార్డును యంగ్ టైగర్ సొంతం చేసుకున్నారు. ఓవర్ సీస్ లో భారీ కలెక్షన్లను రాబడుతున్న ఈ సినిమా దాదాపుగా 1.7 మిలియన్ డాలర్లను (దాదాపు 12.50 కోట్లు) వసూలు చేసింది. ఈ స్థాయిలో ఓవర్ సీస్ వసూళ్లు సాధించిన హీరోల్లో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్ తదితరులు ఉన్నప్పటికీ, వీరెవరకూ తమ వరుస నాలుగు చిత్రాల్లో ఇంత కలెక్షన్లు సాధించలేదు.
ఆ రికార్డు ఒక్క యంగ్ టైగర్ కే సొంతమైంది. ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘నాన్నకు ప్రేమతో’, ‘జనతా గ్యారేజ్’, ‘జై లవకుశ’ చిత్రాలు 1.5 బిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు సాధించగా, ఇప్పుడు ఆ జాబితాలోకి ‘అరవింద సమేత’ కూడా చేరిపోయింది. ఈ ఘనత సాధించిన తొలి తెలుగు హీరో ఎన్టీఆరే కావటం గమనార్హం. ‘అరవింద సమేత’ దూకుడు 3 మిలియన్స్ డాలర్స్ వరకు చేరుకుంటుందా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. ఫస్ట్ వీకెండ్ ముగిసేపాటికి ఇంకెన్ని రికార్డులను యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబో సొంతం చేసుకుంటారో వేచిచూడాలి.
[m9adh]



