ఫస్ట్ వన్ తారక్… సెకండ్ వన్ త్రివిక్రమ్…!

Aravinda Sametha Veera Raghava జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ అభిమానులను విశేషంగా అలరించింది. సిక్స్ ప్యాక్ + యాంగ్రీ లుక్ లో తారక్ ను చూసి ఫ్యాన్స్ మురిసిపోయారు. తాజాగా హీరోహీరోయిన్లతో కూడిన మోషన్ పిక్చర్ ను విడుదల చేసి సర్ ప్రైజ్ ఇచ్చారు. ఎస్.ఎస్.థమన్ బ్యాక్ గ్రౌండ్ సంగీతంతో విడుదలైన ఈ మోషన్ పిక్చర్ లో జూనియర్ ఎన్టీఆర్ కంటే ఎక్కువగా థమన్ హైలైట్ అవుతున్నాడు.

ఎందుకంటే… థమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అలా ఉంది మరి! రొమాంటిక్ యాంగిల్ లో కూర్చున్న జూనియర్ ఎన్టీఆర్ – పూజా హెగ్డేలతో కూడిన పోస్టర్ కు మాంచి రొమాంటిక్ ఫీల్ వచ్చే మ్యూజిక్ అందించడంతో, ఈ లుక్ తారక్ ను ఫ్రెష్ గా ప్రజెంట్ చేసింది. మొత్తంగా చెప్పాలంటే ఫస్ట్ లుక్ పోస్టర్ ఎన్టీఆర్ రేంజ్ మాస్ అభిమానులకు ఐ ఫీస్ట్ గా నిలువగా, మోషన్ పిక్చర్ త్రివిక్రమ్ మార్క్ లో క్లాస్ వీక్షకులకు ఆహ్లాదకరంగా దర్శనమిచ్చింది.

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories