టాలీవుడ్ లో విడుదల కాబోతున్న నెక్స్ట్ బిగ్గెస్ట్ ఫిల్మ్ గా “అరవింద సమేత”పై అటు ఇండస్ట్రీ వర్గాలతో పాటు, ఇటు ప్రేక్షకులలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. త్రివిక్రమ్ – ఎన్టీఆర్ మొదటిసారిగా జోడికట్టడంతో పాటు, ‘మాటల మాంత్రికుడు’ గత సినిమా ‘అజ్ఞాతవాసి’ దారుణ వైఫల్యాన్ని చవిచూడడంతో, ఈ సినిమాను ఎలా తెరకెక్కించారన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
[m9ad]
దీంతో సినిమా ‘ఫస్ట్ టాక్’ ఎప్పుడు వస్తుందోనని అభిమానులు ఆతృతతో అక్టోబర్ 11వ తేదీ వైపుకు చూస్తున్నారు. దీనికి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే… యుఎస్ ప్రీమియర్స్ ప్రదర్శితం అయ్యే షో టైమింగ్స్ ఓ రెండు గంటలు ముందుకు జరగడం విశేషం. ఇండియా టైమింగ్ ప్రకారం అర్ధరాత్రి 2 గంటలకే అమెరికాలో ప్రీమియర్ షోలు ప్రారంభం కానున్నాయి.
అంటే వేకువజామున 4.30 గంటలకు షో పూర్తయిపోయి, సోషల్ మీడియా ద్వారా ‘ఫస్ట్ టాక్’ బయటకు వచ్చేయడం ఖాయం. ఆ టాక్ పాజిటివ్ గా గానీ, బ్లాక్ బస్టర్ గా గానీ ఉంటే ప్రమాదం లేదు, ఒకవేళ కాస్త అటు ఇటుగా ఉంటే మాత్రం ఇండియన్ మార్కెట్ తో పాటు ఓవర్సీస్ లోనూ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. బహుశా స్టోరీ మీద నమ్మకమో ఏమో గానీ, ఎర్లీ షోస్ తో చిత్ర యూనిట్ గ్యాంబ్లింగ్ ఆడడానికి సిద్ధమైంది.
ఇప్పటివరకు సినిమాకు సంబంధించి రిలీజ్ అయిన ప్రమోషనల్ మెటీరియల్ టీజర్, సాంగ్స్… ఏవి కూడా ‘సూపర్ డూపర్’ అన్న టాక్ ను సొంతం చేసుకోలేకపోయాయి. తాజాగా సోషల్ మీడియాలో లీకైన క్లిప్ కూడా బోయపాటి మాస్ మూవీ యాక్షన్ స్టైల్ ను చూపించింది తప్ప, ‘గురూజీ’ మూవీ మార్క్ ను చూపించలేకపోయాయి. దీంతో “అరవింద సమేత” ధియేటిరికల్ ట్రైలర్ అత్యంత కీలకంగా మారింది.
ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ ట్రైలర్ విడుదల కానుండగా, ఇందులోనైనా త్రివిక్రమ్ మార్క్ కనపడితే సినిమాపై అమాంతం అంచనాలు పెరగడం ఖాయం. ఏది ఏమైనా ఈ దసరాకు ‘గురూజీ’ గట్టిగా కొట్టబోతున్నాడన్న నమ్మకం అయితే అటు యంగ్ టైగర్ అభిమానులతో పాటు, మాటల మాంత్రికుడి ఫ్యాన్స్ కూడా గట్టిగా నమ్ముతున్నారు. అది నిజం కావాలని, తారక్ కాంబోలో గురూజీ ‘బ్లాక్ బస్టర్’ కొట్టేస్తాడని ఆశిద్దాం.



