పోస్టర్లు పడ్డాయ్… ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ..!

Aravindha-Sametha-Latest-Updatesయంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ “అరవింద సమేత” సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న అభిమానులకు ఊరట కలిగించే విధంగా చిత్ర యూనిట్ సినిమా రిలీజ్ డేట్ ను అధికారికంగా డిక్లేర్ చేసింది. ఇంతకుముందు ప్రచారంలో ఉన్న తేదీనే ఎలాంటి ట్విస్ట్ లు లేకుండా ప్రకటించింది. దీంతో అక్టోబర్ 11వ తేదీన పండగ చేసుకోవడానికి యంగ్ టైగర్ ఫ్యాన్స్ సన్నద్ధం అవుతున్నారు.

[m9ad]

ADVERTISEMENT

టీజర్ లోనూ, పాటల్లోనూ మాస్ పవర్ ఫుల్ ఎంటర్టైనర్ గా ప్రమోషన్స్ జరుగుతున్న ఈ సినిమా, పోస్టర్స్ దగ్గర వచ్చేపాటికి పక్కా క్లాస్ మూవీ అన్న రీతిలో ప్రొజెక్ట్ చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ను కొత్తగా చూపిస్తూ… చాలా కూల్ గా, ఫన్నీగా చూపించడం, బహుశా చిత్ర యూనిట్ నిర్ణయించుకున్న పబ్లిసిటీలో భాగమేమో గానీ, ఈ పోస్టర్స్ లో యంగ్ టైగర్ ను చూస్తూ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా, తెలుగు హీరోయిన్ ఈషా రబ్బా మరో కీలకపాత్రలో నటించింది. ఎస్.ఎస్.థమన్ అందించిన స్వరాలలో ‘పెనివిటి’ అన్న సాంగ్ సూపర్ హిట్ గా నిలువగా, సౌండింగ్ పరంగా మిగతావి పెద్దగా ఆకర్షించలేదు, మరి విజువల్ గా ఎలా ఉంటాయో అక్టోబర్ 11వ తేదీన తేలనుంది.

ADVERTISEMENT
Latest Stories