‘మాటల మాంత్రికుడు’ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతోన్న “అరవింద సమేత” ఈ నెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు వేగం పుంజుకున్నాయి. ట్రైలర్ విడుదలై యూ ట్యూబ్ లో సందడి చేస్తుండగా, తాజాగా ఈ సినిమా మేకింగ్ వీడియోను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.
[m9adh]
ADVERTISEMENT
ఈ సినిమా షూటింగ్ సెట్స్ పై ప్రముఖ దర్శకుడు కొరటాల శివ కనిపించగా, ఈ రెండు నిముషాల వీడియోలో కత్తి పట్టిన అభయ్ రామ్ హైలైట్ గా నిలిచాడు. త్రివిక్రమ్ ఒడిలో కూర్చుని కత్తి పట్టుకుని నవ్వుతున్న అభయ్ స్టిల్ అభిమానులకు కన్నులవిందుగా మారింది. ఇక షూటింగ్ ఎంత ఆహ్లాదకరంగా సాగిందో అని చెప్పడానికి ఈ రెండు నిముషాల మేకింగ్ వీడియో నిదర్శనంగా నిలుస్తోంది.
ADVERTISEMENT



