అరవింద ప్రమోషన్ – ఒకటి క్లాస్… మరొకటి మాస్..!

Aravindha Sametha Pre Release event on 2nd Octయంగ్ టైగర్ అభిమానులు ఎంతగానో ఆసక్తి చూపుతున్న “అరవింద సమేత” సినిమా అక్టోబర్ 11వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో ఈ పది రోజుల పాటు సినిమాను పూర్తి స్థాయిలో పబ్లిసిటీ చేయడానికి చిత్ర యూనిట్ నిర్ణయించుకుంది. అందులో భాగంగా మంగళవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించనుంది.

ADVERTISEMENT

[m9ad]

దీనికి సంబంధించి తాజాగా ఓ రెండు పోస్టర్స్ ను కూడా విడుదల చేసింది. సాయంత్రం 6 గంటల నుండి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుందని తెలుపుతూ… యంగ్ టైగర్ దీర్ఘంగా ఆలోచిస్తున్న ఓ క్లాస్ పోస్టర్ ను.., జూనియర్ ఆగ్రహంతో రగిలిపోతూ నెత్తురు చిందిస్తున్న మాస్ పోస్టర్ ను… రిలీజ్ చేసారు. ముందుగా ప్రచారం జరుగుతున్నట్లే ఈ సినిమాలో రెండు విభిన్నమైన షేడ్స్ లో జూనియర్ ఎన్టీఆర్ కనిపించబోతున్నారని చిత్ర యూనిట్ చెప్పకనే చెప్తోంది.

ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విడుదల కాబోయే ధియేటిరికల్ ట్రైలర్ బహుశా మరింత స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ – జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో వస్తోన్న తొలి సినిమా కావడంతో, బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సంచలనం సృష్టిస్తుందని ట్రేడ్ వర్గాలు ఎంతో విశ్వాసంతో ఉన్నాయి. అక్టోబర్ 10వ తేదీన ప్రదర్శితం కానున్న ప్రీమియర్స్ తో ‘అరవింద సమేత’ హంగామా మొదలుకానుంది.

ADVERTISEMENT
Latest Stories