త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తోన్న “అరవింద సమేత” నుండి మొదటిసారిగా రియల్ రొమాంటిక్ పోస్టర్ విడుదలైంది. ఇప్పటివరకు సాగిన ప్రమోషన్ అంతా సీరియస్ నోట్ లో సాగగా, ఈ సినిమా ఆల్బమ్ లో ఉన్న ఏకైక డ్యూయెట్ ‘రెడ్డి ఇక్కడ సూడు’ పాట నుండి ఫస్ట్ పోస్టర్ ను విడుదల చేసారు.
[m9ad]
ADVERTISEMENT
ఈ పాట లిరికల్ వీడియోను ఈ రోజు సాయంత్రం 4.50 గంటలకు విడుదల చేయబోతున్నట్లుగా స్పష్టం చేస్తూ విడుదల చేసిన ఈ పోస్టర్ యంగ్ టైగర్ అభిమానులను అలరిస్తోంది. ఇక అందరూ ఎదురుచూస్తోన్న ధియేటిరికల్ ట్రైలర్ అక్టోబర్ 2వ తేదీన హైదరాబాద్ లోని నోవాటెల్ హోటల్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్లో విడుదల చేయబోతున్నారు.
ADVERTISEMENT



