రికార్డుల దిశగా ‘అరవింద సమేత’ ట్రైలర్!

Aravindha Sametha Trailer 5 Million viewsత్రివిక్రమ్ – తారక్ కాంబోలో మొదటిసారిగా రూపుదిద్దుకున్న “అరవింద సమేత” ట్రైలర్ మంగళవారం నాడు సాయంత్రం విడుదల కాగా, కేవలం 12 గంటల్లోనే 5 మిలియన్ క్లిక్స్ ను సొంతం చేసుకుని సరికొత్త రికార్డులను నెలకొల్పే దిశగా సాగుతోంది. ఒకప్పుడు 1 మిలియన్ చేరడానికి పట్టే సమయంలో, ఇప్పుడు 5 మిలియన్స్ క్లిక్స్ అందుకోవడం తెలుగు సినిమా స్టామినాకు నిదర్శనంగా పేర్కొనవచ్చు.

[m9ad]

ADVERTISEMENT

ఇక ట్రైలర్ విషయానికి వస్తే, ‘అరవింద సమేత’ ద్వారా తామేం చెప్పదలచుకున్నారో దానిని సరిగ్గా ట్రైలర్ లో చూపించారు. నిజానికి ప్రేక్షకులకు, ఫ్యాన్స్ కు మాంచి ఊపునిచ్చే విధంగా ట్రైలర్ ఏమీ లేదు గానీ, సినిమా కంటెంట్ ను ప్రాజెక్ట్ చేసే విధంగా కట్ చేయడం చెప్పుకోదగ్గ విషయం. ‘జైలవకుశ’తో కాస్త నిరుత్సాహపడిన యంగ్ టైగర్ ఫ్యాన్స్, ఈ సినిమాతో ఇండస్ట్రీ రికార్డులు కొడతామని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories