ఇండియా అంటే అదే… ధోని సరికొత్త రికార్డ్..!

Asia Cup 2018 - India vs Afghanistan is a tie ఆసియా కప్ లో అన్ని జట్లకు కోలుకోలేని షాక్ ఇచ్చిన ఆఫ్ఘనిస్తాన్, టీమిండియాకు కూడా వదిలిపెట్టలేదు. ఒకానొక దశలో అవలీలగా టీమిండియా విజయం సాధిస్తుందని భావిస్తే, చివరికి వచ్చేసరికి ఆఫ్ఘనిస్తాన్ విజయం దాదాపుగా ఖరారైంది. కానీ ఎట్టకేలకు ‘టై’గా ముగించుకుని టీమిండియా పరువు దక్కించుకోగా, ఆఫ్ఘన్ ఆధిపత్యం ప్రదర్శించింది.

ADVERTISEMENT

[m9ad]

ఈ సిరీస్ లో హాంగ్ కాంగ్ తో జరిగిన మ్యాచ్ లో కూడా టీమిండియా ఇలాగే ఓటమి అంచులదాకా వెళ్లి రాగా, మిగిలిన జట్లను అలవోకగా గెలిచింది. మళ్ళీ పసికూనలు వచ్చేపాటికి చాలా మార్పులతో బరిలోకి దిగింది. దీంతో ఆధిపత్యం ఆఫ్ఘన్ వంతయ్యింది. చివరి రెండు బంతులలో ఒక్క పరుగు కావాల్సిన సమయంలో ఒత్తిడిని అధిగమించలేక జడేజా అవుట్ కావడంతో మ్యాచ్ ‘టై’గా ముగిసింది.

దీంతో ఈ మ్యాచ్ కు కెప్టెన్ గా వహించిన మహేంద్ర సింగ్ ధోని ఖాతాలో పలు రికార్డులు నమోదయ్యాయి. వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక ‘టై’లు సొంతం చేసుకున్న కెప్టెన్ గా ధోని (5) రికార్డులకెక్కాడు. 200 మ్యాచ్ లలో 110 విజయాలను సొంతం చేసుకున్న ధోని, మొదటి మ్యాచ్ లో రిజల్ట్ రాకపోగా, రెండవ మ్యాచ్ లో, చివరి మ్యాచ్ లో ఫలితాలు ‘టై’గా ముగిసాయి.

ఈ ప్రదర్శనతో టీమిండియాకు జరిగే కష్టనష్టాలు పక్కన పెడితే, సిరీస్ ఆద్యంతం అత్యద్భుతమైన ప్రదర్శనతో ఆఫ్ఘనిస్తాన్ జట్టు క్రికెట్ ప్రేమికుల మనసులను గెలుచుకుంది. నిజానికి సిరీస్ విజేతగా నిలవడానికి ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు అన్ని అర్హతలు ఉన్నాయి. బహుశా అంతర్జాతీయంగా కాస్త అనుభవం ఉన్నట్లయితే, అదే జరిగి ఉండేదేమో గానీ, ఇక నుండి ఆఫ్ఘన్ ను ఏ జట్టు లైట్ గా తీసుకునే అవకాశాలు లేవు.

ADVERTISEMENT
Latest Stories