నర్తనశాల… అనగానే నాటి ఎన్టీఆర్ మూవీ గుర్తుకు రావడం ఎంత సహజమో, ఆ తర్వాత బాలయ్య చేస్తూ ఆగిపోయిన ‘నర్తనశాల’ జ్ఞప్తికి రావడం కూడా అంతే సహజం. అలా సెంటిమెంట్ గా మారిపోయిన టైటిల్ తో నాగశౌర్య తన సినిమా పేరు “నర్తనశాల” అని ప్రకటించడంతో, ఈ సినిమా అయినా రిలీజ్ అవుతుందో లేదో అన్న అనుమానాలు ట్రేడ్ వర్గాలతో పాటు ప్రేక్షకులలో కూడా నెలకొన్నాయి.
[m9ad]
అయితే వాటన్నింటిని చేధించుకుంటూ మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రావడానికి “నర్తనశాల” సిద్ధమైంది. అయితే సరిగ్గా గమనిస్తే… ఈ సినిమా టైటిల్ లో ‘నర్తనశాల’కు ముందు ‘@’ సింబల్ ను చేర్చారు. ఇది ఎందుకు పెట్టారు అంటే, సెంటిమెంటే కారణమని తాజాగా చెప్పుకొచ్చారు శౌర్య. ‘నర్తనశాల’ సినిమాతో గతంలో చాలా సినిమాలు ఆగిపోయాయని మా నాన్న చెప్పడంతో, సెంటిమెంట్ గా దానికి ముందు ‘@’ అని పెట్టామని వివరణ ఇచ్చుకున్నారు శౌర్య.
నాటి ఎన్టీఆర్ ‘నర్తనశాల’ను చూశానని, ఆ సినిమా చూసిన తర్వాత తమ సబ్జెక్ట్ కు ఇదే కరెక్ట్ టైటిల్ గా భావించి ఎంపిక చేసుకున్నామని స్పష్టం చేసిన నాగశౌర్య, ఇద్దరు అమ్మాయిలు ఒక గేని లవ్ చేస్తే ఎలా ఉంటుందనేది మంచి వినోదాత్మకంగా చెప్పామని, ఇందులో ఓ చిన్నపాటి సందేశం కూడా ఉందని అన్నారు. అన్నీ సెంటిమెంట్లు దాటుకుని ధియేటర్లలోకి రాబోతున్న ఈ “@నర్తనశాల” శౌర్యకు సూపర్ సక్సెస్ అందివ్వాలని ఆశిద్దాం.



