డబ్బింగ్ సినిమాలతో కొత్త సంవత్సరానికి స్వాగతం

Athade Srimannarayana release tomorrowప్రపంచం మొత్తం కొత్త సంవత్సరం వేడుకలకు మరి కొద్ది గంటలలో సిద్ధం అవుతుంది. అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీకి మాత్రం కొత్త సంవత్సరం అంటే సంక్రాంతికే మొదలు అవుతుంది. అయితే ఈ లోగా కొన్ని డబ్బింగ్ సినిమాలు జనవరి 1న విడుదలై కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పబోతున్నాయి.

కన్నడ సినిమా అతడే శ్రీమన్నారాయణ తెలుగులో అతడే శ్రీమన్నారాయణగా విడుదల అవుతుంది. ఈ చిత్రం తెలుగులో దిల్ రాజు విడుదల చేస్తున్నారు. కన్నడలో ఇప్పటికే విడుదలైన ఈ సినిమాకు రేటింగ్స్ బావున్నాయి. ఓపెనింగ్స్ కూడా బాగా వచ్చాయి. అయితే తెలుగులో ఎలా ఉండబోతుంది అనేది చూడాలి.

ADVERTISEMENT

అలాగే చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న ధనుష్, గౌతమ్ మీనన్ల కాంబినేషన్ సినిమా తూటా కూడా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇవి కాక మమ్మూటీ నటించిన ఒక మలయాళీ సినిమా ‘రాజనరసింహా’ గా విడుదల అవుతుంది. ఈ డబ్బింగ్ సినిమాలు కాకుండా ఉల్లాల.. ఉల్లాల అనే ఒక చిన్న సినిమా కూడా విడుదల అవుతుంది.

అయితే ఇది డైరెక్టు సినిమా. ఈ సినిమాలలో ఏది సక్సెస్ అవుతుందో చూడాలి. అసలైతే ఏ సినిమాకూ సరైన ప్రమోషన్స్ లేకపోవడంతో పెద్దగా బజ్ లేదు. కనీసం దిల్ రాజు అతడే శ్రీమన్నారాయణ ను కూడా పెద్దగా పట్టించుకోలేదు.కొత్త సంవత్సరం స్టార్టింగ్ ఎలా ఉండబోతుందో!

ADVERTISEMENT
Latest Stories