త్రివిక్రమ్ విడుదల చేసిన ట్రైలర్ భలే ఉందిగా!

Avasaraniko Abaddam Trailer, Avasaraniko Abaddam Teaser, Avasaraniko Abaddam Trailer Talk, Avasaraniko Abaddam Release, Avasaraniko Abaddam Trailer Reviewచిన్న చిన్న సినిమాలే కొత్త కొత్త కాన్సెప్ట్ లను ఇండస్ట్రీలోకి తీసుకువస్తాయని తాజాగా విడుదలైన “అవసరానికో అబద్ధం” ధియేటిరికల్ ట్రైలర్ స్పష్టం చేసింది. ‘మాటల మాంత్రికుడు’ త్రివిక్రమ్ శ్రీనివాస్ విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. త్రివిక్రమ్ విడుదల చేయడంతో ఈ సినిమాకు ప్రచారం ఆశించిన స్థాయి కంటే ఎక్కువగానే జరుగుతోంది.

కొత్త నటులతో చిత్రీకరించిన ఈ సినిమా కధ హార్రర్ నేపధ్యంలో తెరకెక్కింది. సాధారణంగా ఇలాంటి హార్రర్ సినిమాలకు నేపధ్య సంగీతమే ఆయువుపట్టు. దానికి నూటికి నూరు శాతం న్యాయం చేసాడు సాయి కార్తీక్. ఇటీవల కాలంలో చిన్న చిత్రాలకు అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను అందిస్తున్న సాయి కార్తీక్ ఇచ్చిన సంగీతం ఈ ట్రైలర్ కు ప్రాణం పోసింది.

ADVERTISEMENT

అయితే సురేశ్ దర్శకత్వం ఈ సినిమా ట్రైలర్ కు, టైటిల్ కు ఎక్కడా సంబంధం లేనట్లుగా కనపడుతోంది. బహుశా పూర్తి సినిమా వస్తే దీనిపై ఓ స్పష్టత వస్తుందేమో చూడాలి. ఎలాంటి అంచనాలు లేకుండా వీక్షిస్తున్న ట్రైలర్ కావడంతో… చూసిన వెంటనే ‘భలే ఉందిగా’ అన్న అనుభూతి ప్రేక్షకులకు కలగడం సహజమే.

ADVERTISEMENT
Latest Stories