
‘బాహుబలి’ సినిమాలో భళ్ళాలదేవుడు పాత్రలో కనిపించిన రానా విగ్రహం ఇంటర్వెల్ సీన్ కు హైలైట్ అయిన విషయం తెలిసిందే. బహుశా ఈ సినిమా బాహుబలి పాత్ర పోషించిన ప్రభాస్ విగ్రహం రూపకల్పన చేసినట్లుగా కనపడుతోంది. ఓ భారీ విగ్రహ ప్రతిష్ఠ కోసం చేస్తున్న ఏర్పాట్లుగా కనపడుతున్న ఈ వీడియోను ఆన్ షూటింగ్ స్పాట్ లోది కాకపోయినా, మేకింగ్ లో భాగం. మరి ఎలా బయటకు వచ్చిందో గానీ, ప్రస్తుతం వెబ్ మీడియాలో చక్కర్లు కొడుతోంది ఈ వీడియో.
ప్రస్తుతం క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్నామని నిర్మాత స్పష్టం చేయడంతో, ఈ విగ్రహం క్లైమాక్స్ లో వస్తుందన్న విషయం అర్ధమైపోయింది. ఏప్రిల్ 17, 2017న విడుదల కానున్న ఈ సినిమా షూటింగ్ మొత్తాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నది చిత్ర యూనిట్ ప్లాన్. మొదటి పార్ట్ ను మించిన స్థాయిలో రెండవ పార్ట్ ను జక్కన్న చెక్కుతున్నారని సినీ వర్గాల టాక్.
A long-discussed change to how international students stay in the United States is now nearing…
The decision to bring Hari Gowra on board for the background score of Chiranjeevi's Vishwambhara…