
గత నెల ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయ్యి తీహార్ జైల్లో రిమాండ్ ఖైదీ గా ఉన్న బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కు కోర్ట్ లో ఈసారి కూడా నిరాశే ఎదురయ్యింది. ఈడీ, సిబిఐ కేసులలో నిందితురాలుగా ఉన్న కవిత తనకు బెయిల్ ఇవ్వాలంటూ ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్ట్ ను ఆశ్రయించారు.
అయితే తన పిల్లాడికి పరీక్షలు ఉన్నాయంటూ ఒకసారి, తాను తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ తరుపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలి అంటూ మరోసారి బెయిలు కోసం కోర్ట్ మెట్లెక్కిన కవితకు రెండు సార్లు ఎదురుదెబ్బే తగిలింది. కవిత బయటకు వెళితే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఎక్కువగా ఉంది అంటూ సిబిఐ తరుపున వాదనలు వినిపించారు న్యాయవాదులు.
వారి వాదనకు అంగీకరించిన కోర్ట్ కవిత బెయిలు అభ్యర్థనలను తోసిపుచ్చింది. అయితే తాజాగా బెయిలు కోసం మరోసారి కోర్ట్ తలుపు తట్టిన కవితకు మళ్ళీ అదే జవాబిచ్చింది ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్ట్. కవిత బెయిలును నిరాకరిస్తూ తీర్పు వెల్లడించింది న్యాయస్థానం. దీనితో ఈసారి తెలంగాణ లో కవిత లేకుండానే బిఆర్ఎస్ ఎన్నికల తంతును పూర్తి చేసేలా ఉంది.
ఇటు బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా తెలంగాణ ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా గడుపుతున్నారు. కవిత అరెస్టు పై బిఆర్ఎస్ పార్టీ కానీ ఆ పార్టీ నాయకులు కానీ అనుకున్న స్థాయిలో కేంద్ర ప్రబుత్వం మీద వ్యతిరేకత వ్యక్తం చేయకపోవడంతో కవిత అరెస్టు ను కేసీఆర్ లైట్ తీసుకున్నారా అనే సందేహాలు కలుగుతున్నాయి. గతంలో ఏపీలో బాబు అరెస్టయిన సందర్భంలో ఆయన తనయుడు నారా లోకేష్ ఢిల్లీ కేంద్రంగానే చక్రం తిప్పి బాబుని బయటకు తీసుకురాగలిగారు.
కానీ ఇప్పుడు కవిత కేసు పట్ల కేసీఆర్ అటువంటి చర్యలు ఏమి చేపట్టకపోవడం, కవిత అరెస్ట్ ను పెద్దగా చేసి చూపించకపోవడం కవిత పై ఈడీ, సిబిఐ అధికారులు చేసిన ఆరోపణలు నిజమనే సంకేతాన్ని ప్రజలకు పంపుతున్నాయి. అదికాక కవిత అరెస్టు పై స్పందించడానికి ఆసక్తి చూపని కేసీఆర్ ఆంధ్ర రాజకీయాల మీద విశ్లేషణలు చేయడం విడ్డురమనే చెప్పాలి.
దీనితో పక్క రాష్ట్ర రాజకీయాలు గురించి కాదు ముందు మీ కుటుంబంలో జరిగే అరెస్టులు, వారికొచ్చే బైళ్ల మీద ద్రుష్టి పెట్టి ముందుగా అంచనాలు వేయండి అంటూ కేసీఆర్ కు కౌంటర్లు వేస్తున్నారు టీడీపీ మద్దతుదారులు.
India beat West Indies by 14 runs in the third T20I at the Holkar Stadium…
Rajinikanth's highly anticipated sequel Jailer 2 directed by Nelson Dilipkumar is all set to hit…