ఉగాదికి బలయ్య అఖండ గర్జన?

balakrishna boyapati srinu movie new updateనందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను తదుపరి చిత్రం మే 28 న ఎన్టీఆర్ జయంతి స్పెషల్ గా విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఈ చిత్రం యొక్క చివరి భాగాల షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది. ఈరోజు ఉదయం, ఈ చిత్రం టైటిల్ ఏప్రిల్ 13 న మధ్యాహ్నం 12.33 గంటలకు రివీల్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. ఇంకో రెండు రోజుల్లోనే సినిమా టైటిల్ బయటకు రానుండగా… టైటిల్ గురించి పుకార్లు ఆగడం లేదు.

ఇప్పటివరకు అనేక టైటిల్స్ మనం వింటూ వచ్చాము. తాజాగా ఈ సినిమాకు ‘అఖండ’ అనే టైటిల్ ఫైనల్ చేసారని వార్తలు వస్తున్నాయి. అఖండ అంటే భారీ. నందమూరి అభిమానులు ఇది చిత్రం స్కేల్‌కు సరిపోతుందని… అలాగే బాలకృష్ణ మరియు బోయపాటి శ్రీను కాంబినేషన్ పై సహజంగా ఉండే హైప్ కు సరిగ్గా సరిపోతుందని అభిప్రాయ పడుతున్నారు. 13 వరకు అధికారిక నిర్ధారణ కోసం వేచి ఉండాలి.

ADVERTISEMENT

మే 28న రవితేజ ఖిలాడి కూడా రానున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. అయితే ఇందులో ఏ సినిమా వాయిదా పడుతుంది అనేది చూడాలి. ఏప్రిల్ 12న ఖిలాడి టీజర్ విడుదల కానుంది. ప్రస్తుతానికి రవితేజ కూడా తగ్గేలా కనిపించడం లేదు. అయితే కరోనా కారణంగా కాంపిటీషన్ లో రావడం అంటే రిస్క్ అనే అనుకోవాలి. పరిస్థితులు అప్పటికి ఇంకా తీవ్రం అయితే రెండు సినిమాలు వాయిదా పడినా ఆశ్చర్యపోనవసరం లేదు.

జూన్‌లో విడుదలైన బాలయ్య సినిమా ఫస్ట్ లుక్ టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రం యొక్క హైప్ మరియు అంచనాలు భారీగా పెంచింది. మిరియాల రవీందర్ రెడ్డి ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ కింద ఈ ప్రాజెక్టును బ్యాంక్రోలింగ్ చేస్తున్నారు. అతను గతంలో బోయపాటి యొక్క జయ జానకి నాయకను నిర్మించాడు. ఈ చిత్రానికి తమన్ సంగీతం కంపోజ్ చేస్తున్నారు. డిక్టేటర్ తర్వాత బాలయ్యతో కలిసి ఇది రెండోసారి. ప్రగ్యా జైస్వాల్, పూర్ణ కథానాయికలు.

ADVERTISEMENT
Latest Stories