అసుర వదతో రంగంలోకి దిగిన బాలయ్య

Balakrishna - Boyapati-Srinu movie shooting started in ramoji film cityనందమూరి బాలకృష్ణని 2019 చాలా నిరాశపరచింది. ఆయన నుండి మూడు సినిమాలు రాగా మూడు డిజాస్టర్లుగా మారాయి. దీనితో ఆయన తనకు బాగా కలిసొచ్చిన బోయపాటి శ్రీనుతో జతకలిశారు. ఈ సినిమా చాలా సార్లు వాయిదా పడుతూ… ఈరోజు సెట్స్ మీదకు వెళ్ళింది. రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక ఫైట్ తో షూటింగ్ మొదలు పెట్టారు.

ADVERTISEMENT

బాలయ్య బోయపాటి సినిమాలలో ఫైట్స్ హైలైట్ ఇప్పుడు ఏకంగా ఫైట్స్ తోనే షూటింగ్ మొదలు పెట్టారు. గతంలో బోయపాటి జయజానకి నాయక సినిమాను నిర్మించిన మిర్యాల రవీంద్రరెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బాలకృష్ణ కేరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ చిత్రంగా రూపొందించనున్నారు.

సింహా – లెజెండ్ సినిమాలతో బోయపాటి శ్రీను – బాలకృష్ణ కాంబినేషన్ కి ఎంతగా క్రేజ్ వచ్చిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. బాలకృష్ణ హీరోయిజాన్ని ప్రేక్షకులకు సరికొత్తగా చూపించి మాస్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు బోయపాటి. ఇప్పుడు వారి కాంబినేషన్ లో కావడంతో ఈ సినిమా మీద అంచనాలు బాగా ఉన్నాయి.

మొదట్లో ఈ సినిమా జులైలో విడుదల చెయ్యాలి అనుకున్నా తాజాగా దసరాకు అనుకుంటున్నారు. ఇందులో ఒక హీరోయిన్ గా అంజలి ని అనుకుంటున్నారని సమాచారం. బోయపాటికి కూడా సరైనోడు తరువాత హిట్ లేదు. దీనితో ఈ సినిమా హిట్ కావడం ఆయనకు కూడా కీలకం.

ADVERTISEMENT
Latest Stories