మోక్షజ్ఞను బలవంతపెడుతున్నారా?

Balakrishna confirms Nandamuri Mokshagna entry into moviesనందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ గురించి ఎప్పటినుండో ఆసక్తి ఉంది. బాలయ్య వారసుడు కావడంతో నందమూరి అభిమానులు దాని కోసం ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్నారు. అయితే ఇదిగో అదిగో అంటూ అది వాయిదా పడుతూ వస్తుంది. అది అలా ఉంచితే అప్పుడప్పుడు మోక్షజ్ఞ ఫోటోలు బయటకు వచ్చి ఫ్యాన్స్ ను ఇబ్బంది పెడుతున్నాయి.

మోక్షజ్ఞ పర్సనాలిటీ చూస్తే అసలు హీరో మెటీరియల్ లా లేడు. కనీసం అతనికి సినిమాల మీద ఇంట్రెస్టు ఉన్నట్టు కూడా అనిపించడం లేదు. దీనితో మోక్షజ్ఞ మీద బాలయ్య అభిమానులు కూడా ఆశలు పెట్టుకోవడం మానేశారు. అయితే బాలయ్య మాత్రం అదేమి లేదు అంటున్నాడు. మోక్షజ్ఞ సినిమాల్లోకి రావడం ఖాయమంటున్నారు.

ADVERTISEMENT

తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన బాలయ్య మోక్షజ్ఞకు సినిమాలపై ఆసక్తి కలుగుతోందని, సినిమాల గురించి ఇప్పుడిప్పుడే తనతో చర్చిస్తున్నాడని, తప్పకుండా అతన్ని వెండితెరపై చూస్తారని, కానీ అదెప్పుడన్నది మాత్రం చెప్పలేనని అన్నారు. సో.. ఈ మాటలతో బాలయ్య అంత తప్పకుండా తన వారసుడ్ని అభిమానులకు అందిస్తారని రూఢీ అయిపోయింది.

బాలయ్య చెప్పేదాని బట్టి మోక్షజ్ఞకు ఇంట్రెస్టు లేదు గానీ ఫోర్స్ చేసే సినిమాల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇంట్రెస్టు లేకుండా వచ్చి సినిమాలు చేస్తే అభిమానులు అనుకున్న స్థాయికి చేరుకోగలడా? అనే అనుమానం కూడా లేకపోలేదు. ఒకవేళ నిజంగా బాలయ్య అన్నట్టు ఇంట్రెస్టు కలిగితే బరువు తగ్గడం ఎంత సేపులే అని మరి కొందరు అభిమానులు సమర్ధించుకుంటున్నారు.

ADVERTISEMENT
Latest Stories