‘వైరల్’ అవుతోన్న ‘బాలయ్య’ వీడియో!

Balakrishna hit his assistant on headనందమూరి నటసింహం ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. అలా పూరీ జగన్నాధ్ సినిమా “పైసా వసూల్”కు గుమ్మడికాయ కొట్టాడో లేదో ఇలా కేఎస్ రవికుమార్ సినిమాకు కొబ్బరికాయ కొట్టేసారు. ఇంత పక్కా షెడ్యూల్స్ బహుశా ఏ హీరోకు కూడా సాధ్యం కావేమో గానీ, ఓ పక్కన ఎమ్మెల్యేగా, మరో పక్కన హీరోగా రెండు పడవలపై కాలు పెట్టిన బాలయ్య మాత్రం అవలీలగా పని కానిచ్చేస్తున్నారు.

ADVERTISEMENT

కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో నటించబోయే సినిమా నేడు ప్రారంభోత్సవాన్ని జరుపుకోగా, ఇందులో చోటు చేసుకున్న ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతోంది. బాలయ్య ధరించిన షూస్ కు సంబంధించిన విషయమో ఏమో గానీ తన వద్దకు వచ్చిన అసిస్టెంట్ పై చేయి చేసుకున్న బాలయ్య, ఆ తర్వాత కింద వైపుకు చూడాల్సిందిగా సూచన చేసారు.

బాలయ్య పక్కనే ఉన్న దర్శకుడు రవికుమార్ కూడా బాలయ్య బూట్ల వైపుకు చూపించడం విశేషం. విషయం ఏదైనా గానీ సదరు వ్యక్తిపై బాలయ్య చేయి చేసుకోవడం, అది మీడియాలో రికార్డ్ కావడంతో… సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే అది సరదాగా కొట్టారో లేక సీరియస్ గా కొట్టారో గానీ, ఆ సీన్ లో బాలయ్య దర్శకుడితో చర్చలు జరుపుతుండగా, చేయి చేసుకున్న తర్వాత మిగిలిన వారంతా నవ్వడం విశేషం.

ADVERTISEMENT
Latest Stories