ఆ సినిమా మీద బాలయ్యకు ఇంట్రెస్టు లేదా?

balakrishna not interested in Ayyappanum Koshiyum remakeఅయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్ తెలుగు రీమేక్ వార్త వెలువడినప్పటి నుంచి, బాలయ్య బిజు మీనన్ పాత్ర చేస్తున్నట్లు పుకార్లు వస్తున్నాయి. అయితే, నిన్న ఒక ఇంటర్వ్యూలో ఉన్న నటుడు మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి ఆసక్తి కనబరచలేదు. మల్టీస్టారర్స్ కారణంగా తనకు గతంలో కొన్ని చేదు అనుభవాలు ఉన్నాయని బాలయ్య చెప్పడం గమనార్హం.

దీనితో బాలయ్య అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్ తెలుగు రీమేక్‌ చెయ్యడంపై సందేహాలను నింపుతుంది. ఈ రీమేక్‌లో పృథ్వీరాజ్ పాత్రను రానా చేయవచ్చని వార్తలు వెలువడుతున్నాయి. బాలయ్య మరియు రానా ఆ పాత్రలకు సరిగ్గా సరిపోతారు. మరోవైపు, ఈ ప్రాజెక్ట్ కోసం మేకర్స్ ఇంకా డైరెక్టర్‌ను ఖరారు చేయలేదు.

ADVERTISEMENT

ఈ ఏడాది నితిన్ భీష్మాతో హిట్ కొట్టిన సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ సినిమా రీమేక్ హక్కులను దక్కించుకుంది. థ్రిల్ల‌ర్ మూవీగా తెర‌కెక్కిన అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్ చిత్రం రాజీప‌డని ఇద్దరు అహంభావం గ‌ల వ్య‌క్తుల జీవితాల నేప‌థ్యంలో తెర‌కెక్కింది. తమిళంలో హిందీలో కూడా ఈ సినిమాను రీమేక్ చెయ్యడానికి సన్నాహాలు జరుగుతున్నాయి

బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం ఈ సినిమా హిందీ రీమేక్ రైట్స్ సొంతం చేసుకున్నాడు. తన జెఏ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మించబోతున్నాడు. తొందరలో ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుంది. మలయాళంలో సక్సెస్ అయిన ఈ చిత్రంలో మిగతా భాషలలో ఎలా పెర్ఫర్మ్ చేస్తుంది అనేది చూడాలి.

ADVERTISEMENT
Latest Stories