
కేంద్ర మంత్రి, కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై ఉచ్చు బిగుస్తుంది. 17 ఏళ్ళ మైనర్ బాలిక పై బండి భగీరథ్ వేధింపులకు పాల్పడుతున్నాడని బాలిక తల్లి ఈ నెల 8 న పోలీస్ స్టేషన్ లో భగీరథ్ పై కేసు నమోదు చేసింది.
ఈ నేపథ్యంలో బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదయ్యింది. అయితే బాధితుల నుంచి ఫిర్యాదు అంది మూడు రోజులు గడుస్తున్నా ఇంకా బండి భగీరథ్ పై చర్యలేవి అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డీజీపీ సీవీ ఆనంద్ ను ప్రశ్నించారు.
దీనితో రంగంలోకి దిగిన పోలీసులు ముఖ్యమంత్రి రేవంత్ కు కేసు వివరాలు వెల్లడించి ప్రధాని మోదీ పర్యటన దృష్ట్యా కేసు విచారణలో కాస్త జాప్యం జరిగిన మాట వాస్తవం అంటూ విచారణకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా బండి భగీరథ్ కేసు దర్యాప్తు పర్యవేక్షణ బాధ్యతలను కూకట్ పల్లి డీసీపీ రుతురాజ్ కి అప్పగిస్తున్నట్టు వెల్లడించారు.
ఇదిలా ఉంటే తన పై హనీ ట్రాప్ జరిగిందంటూ బండి తనయుడు భగీరథ్ సైతం కరీంనగర్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు నమోదు చేసారు. అయితే గతంలో కూడా భగీరథ్ తన జూనియర్ విద్యార్థి పై దాడి చేసిన ఘటనలు మీడియాలో హల్ చల్ చేసాయి.
ఇక ఇప్పుడు ఏకంగా అతని పై పోక్సో కేసు నమోదు కావడంతో ఇటు బిఆర్ఎస్ నేతలు సైతం బండి భగీరథ్ ను అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలంటూ మేడ్చల్ జాతీయ రహదారి మీద బండి సంజయ్ – బండి భగీరథ్ ఫోటోలను చెప్పులతో తొక్కి వారి ఫోటోలను కాల్చి తమ నిరశన తెలియచేసారు.
ఇటు టి. బీజేపీ అధినేత రామచంద్ర రావు సైతం ఈ విషయం పై స్పందిస్తూ బండి భగీరథ్ పోక్సో కేసు బీజేపీ పార్టీకి సంబంధం లేని అంశమంటూ పార్టీని వివాదంలోకి లాగొద్దన్నారు. ప్రభుత్వం కేసు విచారణ జరిపి బాధితులకు న్యాయం చెయ్యాలని అలాగే నిందితుల పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ వివాదాన్ని బండి కుటుంబ ఖాతాలో వేసేసారు రామచందర్ రావు.
ఈ నేపథ్యంలో ఇపుడు బండి సంజయ్ పేరు అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో మీడియాలో నానుతుంది. అలాగే అధికారం,డబ్బు, హోదా ఇవేమి న్యాయానికి అడ్డు గోడ కారాదని, రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్క బాలికకు సమాన న్యాయం దక్కాలంటూ హీరో మంచు మనోజ్ తన X వేదికగా స్పందించారు.
A new inside news related to a big budget Pan-India South movie has surfaced online.…