వైరల్ వీడియో – పారిపోతున్న బండ్ల గణేష్!

Bandla Ganesh- quits from tv5 live showగడిచిన కొద్ది గంటలుగా సోషల్ మీడియాలో ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. ప్రముఖ న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూకు వచ్చిన బండ్ల గణేష్, సదరు మీడియా ప్రతినిధి ప్రశ్నలు వేస్తున్న క్రమంలో… ‘జనసేనలో కాకుండా కాంగ్రెస్ లో ఎందుకు మీరు చేరారు?’ అన్న ప్రశ్న వేయగానే, ‘ఇలాంటి ప్రశ్నలు వేస్తే నేను వెళ్ళిపోతాను’ అంటూ పారిపోతున్న వీడియో వైరల్ అవుతోంది.

ADVERTISEMENT

[m9ad]

‘చిన్నప్పటి నుండి నేను నమ్మే పార్టీ కాంగ్రెస్ గనుక అందులో చేరారని’ చెప్పిన బండ్లను, ‘మరి మీ దేవుడుగా భావించే జనసేనలోకి ఎందుకు వెళ్ళలేదు’ అని ప్రశ్నించగా, ‘అది నా వ్యక్తిగతం’ అంటూ బదులిచ్చారు. అయినా మీరు దానిపై ప్రశ్నిస్తే, నేను వెళ్ళిపోతాను, అసలు మీ ఇంటర్వ్యూకు రాకూడదనుకున్నా… ఏదొక వివాదం అవుతుందని అనుకున్నా…. అంటూ ఫోన్ పట్టుకుని వెళ్ళిపోయే ప్రయత్నం చేసారు.

ADVERTISEMENT
Latest Stories