క్లాసిక్ ను చెడగొడతారా ఏంటి?

bellamkonda suresh trying to remake dhanush karnan movieధనుష్ ఇటీవల నిర్మించిన బ్లాక్ బస్టర్ చిత్రం కర్ణన్ త్వరలో తెలుగులో రీమేక్ అయ్యే అవకాశం ఉందని ఒక సెక్షన్ ఆఫ్ మీడియా తెలిపింది. కానీ ఈ చిత్ర నిర్మాత కలైపులి ఎస్ తను ఈ వార్తను ఎక్కడా ధృవీకరించలేదు. అయితే, ధనుష్ నటించిన రీమేక్ కోసం చర్చలు జరుగుతున్నాయని విశ్వసనీయంగా తెలుస్తుంది.

మరోవైపు సీనియర్ నిర్మాత బెల్లంకొండ సురేష్ కర్ణన్ తెలుగు రీమేక్ హక్కులను దక్కించుకోవడానికి చర్చలు జరుపుతున్నాడని అంటున్నారు. మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన కర్ణన్… ఒక అణచివేతకు గురైన సమాజానికి చెందిన యువకుడు తన ప్రజలకు, తన గ్రామానికి జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా చేసిన పోరాటం గురించిన కథ.

ADVERTISEMENT

అయితే ఇప్పుడు ఈ సినిమా తెలుగు రీమేక్ మీద సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ధనుష్ సూపర్ యాక్టర్. అసురన్ లో అయితేనేమీ… కర్ణన్ లో అయితే ఏమీ అద్భుతంగా నటించాడు. మరోవైపు బెల్లంకొండ మాములు కమర్షియల్ సినిమాలలోనే తేలిపోయాడు. ఈ సినిమాకు అతను సరిపోడని వారి అభిప్రాయం.

అసురన్ సినిమాను విక్టరీ వెంకటేష్ తెలుగులో నారప్పగా రీమేక్ చేస్తున్నారు. ఆ సినిమా వచ్చే నెల 14న ప్రేక్షకుల ముందుకు రావాల్సింది అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆగిపోయింది. ఒక వర్గం కర్ణన్ ను కూడా వెంకటేష్ చేస్తే బావుంటుందని అభిప్రాయపడుతోంది. కర్ణన్ మే రెండో వారంలో అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యే అవకాశం ఉంది.

ADVERTISEMENT
Latest Stories