టీజర్ టాక్ – కామెడీ క్రైమ్ థ్రిల్లర్!

priyamani BhamaKalapaam Teaser తెలుగు ఓటీటీగా అంచలంచెలుగా ఎదుగుతోన్న ఆహా తాజాగా మరో కొత్త సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సిద్ధమవుతోంది. “భామా కలాపం” పేరుతో ప్రియమణి ప్రధాన పాత్రలో ఓ క్రైమ్ థ్రిల్లర్ ను ప్రేక్షకులకు అందించబోతోంది.

ఫిబ్రవరి 11వ తేదీన ఆహాలో విడుదల కాబోతోన్న ఈ సినిమా టీజర్ ను ఆహా తాజాగా విడుదల చేసింది. పక్క ఇంట్లో ఏం జరుగుతుందో అన్న ఆసక్తి కలిగిన క్యారెక్టర్ లో ప్రియమణి నటిస్తోంది. కామెడీగా ప్రారంభమైన ఈ క్యారెక్టర్ ఓ మర్డర్ ఉదంతం కీలకంగా మారనుంది.

ADVERTISEMENT

ఆ మర్డర్ చేధించే క్రమంలో జరిగే ఆసక్తికర సన్నివేశాలతో టీజర్ ను బాగానే కట్ చేసారు. అభిమన్యు దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ‘రాధే శ్యామ్’ చిత్ర సంగీత దర్శకుడు జస్టిన్ ప్రభాకరన్ స్వరాలు సమకూర్చగా, మార్క్ రాబిన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను అందించారు.

ఒకప్పుడు సిల్వర్ స్క్రీన్ ను తన అందచందాలతో ఒక ఊపు ఊపిన ప్రియమణి వివాహం అయిన తర్వాత సినిమాలకు దూరమైంది. అయితే బుల్లితెరపై మాత్రం ‘ఢీ’ షో ద్వారా ప్రేక్షకులకు దగ్గర అయిన ప్రియమణికి ఈ ఓటీటీ “భామా కలాపం” అవకాశం ఎలాంటి స్వాగతాన్ని పలుకుతుందో చూడాలి.

ADVERTISEMENT
Latest Stories