మరో 10 రోజుల్లో ‘భరత్ అనే నేను’ రిలీజ్!

Bharat Ane Nenu Tamil Releaseచెన్నైలో ఆల్ టైం తెలుగు బ్లాక్ బస్టర్ గా నిలిచి, ‘నాన్ భరత్ అనే’ రికార్డును సొంతం చేసుకున్న మూవీ మరో పది రోజుల్లో తమిళంలోకి డబ్ అయ్యి తమిళ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఈ బుధవారం నాడు తమిళ సెన్సార్ ను పూర్తి చేసుకున్న తర్వాత, శుక్రవారం నాడు తమిళ ట్రైలర్ ను విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ముందుగా మహేష్ బాబే డబ్బింగ్ చెప్తారని భావించినప్పటికీ, ప్రస్తుతం ప్రిన్స్ విదేశాలలో ఉండడం వలన, రొటీన్ డబ్బింగ్ కార్యక్రమాలు ముగిసాయి.

ఇక ఆదివారం నాడు తమిళ ఆడియోను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. దేవికి తమిళంలో కూడా మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. మే 25 విడుదలతో కూడిన తమిళ ప్రోమోలను టీవీలలో సోమవారం నాటి నుండి విస్తృతంగా ప్రదర్శించనున్నారు. తెలుగు నాట మహేష్ బాబుకు, ఫ్యాన్స్ కు మంచి అనుభూతులను పంచిన ఈ సినిమా తమిళంలో కూడా ఎలాంటి ఫలితాన్ని చవిచూస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రిన్స్ కైతే మంచి మార్కెట్ ఉందని ‘బాహుబలి 2’ రికార్డులను బద్దలు కొట్టడం ద్వారా ఇప్పటికే స్పష్టమైంది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories