
Bhogapuram Airport eyes direct global flights
ఇంతకీ భోగాపురం విమానాశ్రయం క్రెడిట్ ఎవరిది? కూటమి ప్రభుత్వానిదా లేక వైసీపీ ప్రభుత్వానిదా?ఈ మిలియన్ డాలర్ ప్రశ్నకు అందరికీ ఆమోదయోగ్యమైన జవాబు ఎవరూ చెప్పలేరు.
సరే! దాని క్రెడిట్ క్లెయిమ్ చేసుకుంటున్నప్పుడు దాని గురించి నాలుగు మంచి ముక్కలు చెప్పాలి కదా?కానీ విశాఖ నుంచి రాష్ట్రంలో, దేశంలో వివిధ ప్రాంతాలకు, విదేశాలకు రాకపోకలు సాగిస్తున్న పలు విమాన సర్వీసులు పూర్తిగా రద్దు అయ్యాయని, కనుక భోగాపురం వద్ద అంత పెద్ద విమానాశ్రయం కట్టి ఏం ప్రయోజనం?విమానాల రాకపోకలు లేక అది క్రమంగా పాడు బడిపోతుందని కొందరు మనసులో అక్కసు వెళ్ళగక్కారు.
మనమందరం గర్వపడే స్థాయిలో ఓ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం అవుతుంటే సంతోషించాలి కానీ ఇలా దుష్ప్రచారం చేయడం చాలా బాధాకరం.
అమెరికా, యూరోప్, గల్ఫ్ దేశాలలో పని చేస్తున్న ఆంధ్రా ప్రజలు, ఆయా దేశాలలో స్థిరపడిన ఎన్ఆర్ఐలు ఇంతకాలం ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్ విమానాశ్రయాల ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి అంతర్జాతీయ విమాన సేవలు ప్రారంభిస్తే, ఇక అక్కడి నుంచే నేరుగా రాకపోకలు సాగించవచ్చని సంతోషిస్తున్నారు.
పౌరవిమానయానశాఖ ముందుగానే ఇది కూడా పరిగణనలోకి తీసుకునే భోగాపురం వద్ద అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసింది.
కనుక అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్, గల్ఫ్ దేశాల నుంచి నేరుగా భోగాపురానికి అంతర్జాతీయ విమాన సేవలు ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు చేపడుతోంది.
అలాగే ఇదివరకు ఉన్న సర్వీసులతో పాటు, కొత్తగా శ్రీలంక, దేశంలో వారణాశి, అయోధ్య, కోయంబత్తూరు, పూణే నగరాలకు కూడా విమాన సేవలు ప్రారంభించేందుకు చర్యలు చేపడుతోంది. అవి ఫలిస్తే అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం జాతీయ, అంతర్జాతీయ విమానాలతో, ప్రయాణికులతో కళకళలాడబోతోంది.
The Telugu box office is usually explosive in nature when there is an interesting film…
తెలంగాణ కాంగ్రెస్ నాయకుల తీరు చూస్తే కూర్చున్న కొమ్మనే నరుక్కునే రీతిలో కనిపిస్తుంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ తెలంగాణలో…