గుర్తుపెట్టుకోండి… భ్రమరాంబకు నచ్చేసాను..!

Bhramaramba Ki Nachesanu Songసుకుమార్ దర్శకత్వం వహించిన ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలో జగపతిబాబు చెప్పినట్లుగా ‘ఇది గుర్తు పెట్టుకో… మళ్ళీ మాట్లాడదాం…’ అన్న డైలాగ్ మాదిరి ‘భ్రమరాంబకు నచ్చేసాను… జజ్జనక అంబరమే టచ్ చేసాను…’ అన్నవి గుర్తు పెట్టుకోండి. ఎందుకంటే రాబోయే రెండు, మూడు నెలల్లో ఈ పదాలను ఎక్కువగా పలుకుతూ ఉంటామని చెప్పాలి. అవును… ‘100% లవ్’ సినిమాతో ‘డియ్యాలో డియ్యాలో’ అంటూ ఊపేసిన దేవిశ్రీప్రసాద్, ఈ సారి ‘భ్రమరాంబకు నచ్చేసాను…’ అంటూ ఊపేయబోతున్నాడు.

దేవిశ్రీప్రసాద్ హుషారైన సంగీతం అందిస్తే ఏ రేంజ్ లో ఉంటుందో మరోసారి చాటిచెప్పిన పాటగా ఈ “భ్రమరాంబకు నచ్చేసాను…” నిలుస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఇటీవల కాలంలో ఆడియో హిట్స్ లేక సంగీత ప్రియులు అల్లాడిపోతున్న తరుణంలో దేవిశ్రీ వదిలిన ఈ పాట అదరగోట్టేయబోతుందన్న నమ్మకాన్ని కలిగించింది. శ్రీమణి అందించిన సాహిత్యానికి దేవిశ్రీ సోదరుడు సాగర్ జోష్ ఫుల్ స్వరం తోడై సంగీత, సాహిత్య ప్రియులను స్టెప్ లు వేయిస్తోంది ఈ పాట. ఇంతకీ ఇది ఏ సినిమా నుండో చెప్పలేదు కదూ… చైతూ, రకుల్ ప్రీత్ లు జంటగా నటిస్తున్న “రారండోయ్ వేడుక చూద్దాం” సినిమా ఆల్బమ్ లోనిది ఈ సూపర్ హిట్ సాంగ్..!

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories