పుణ్యం పురుషార్థం రెండూ దక్కని కొత్త రిలీజులు

Bhuvana Vijayam Music School Farhanaఅతివృష్టి అనావృష్టి అనేది కొన్ని శుక్రవారాలు టాలీవుడ్ బాక్ఫాఫీస్ ఖచ్చితంగా పాటించే మంత్రం. ఒకపక్క మండిపోయే ఎండల్లో సినిమా మరీ బాగుంటే తప్ప జనం థియేటర్లకు రాని పరిస్థితుల్లో ఒకే రోజు ఎనిమిది రిలీజైతే అందులో కస్టడీ ఒకటే పబ్లిక్ కి రిజిస్టర్ కావడం విచిత్రమే. ఇది కూడా స్టార్ క్యాస్టింగ్, క్రేజీ కాంబినేషన్ వల్ల ఆడియన్స్ దృష్టిలో పడింది. మిగిలినవి వచ్చిన సంగతి మీడియాకు తప్ప ఇంకెవరికి పెద్దగా తెలియదనడం అతిశయోక్తి కాదు. ఎన్ని షోలు పడ్డాయో ఎన్ని క్యాన్సిలయ్యాయి ఒక రకంగా భేతాళ ప్రశ్నే.

శ్రేయ శరన్ ప్రధాన పాత్రలో మ్యూజిక్ స్కూల్ వచ్చింది. మాస్ట్రో ఇళయరాజా సంగీతం. టైటిల్ చూడగానే సంగీత ప్రియులు బోలెడు ఆశిస్తారు. తీరా జరిగిందేమిటి. కాన్సెప్ట్ బాగానే ఉన్నా ప్రెజెంటేషన్ లో ఉన్న నీరసం వల్ల బొమ్మ తేడా కొట్టేసింది. జీరో బజ్ తో కొట్టుమిట్టాడే టైంలో ఇలాంటి టాక్ వల్లే ఒరిగే ప్రయోజనం ఏమిటో చెప్పనక్కర్లేదు. సునీల్ ప్రధాన పాత్రలో భువన విజయాన్ని ఇవాళే తీసుకొచ్చారు. ట్రైలర్ చూస్తే ఏదో డిఫరెంట్ గా ట్రై చేశారనిపించింది కానీ అసలు మ్యాటర్ వీకని పెద్ద తెరపై చూస్తే కాని అర్థం కాలేదు.

ADVERTISEMENT

ఐశ్యర్య రాజేష్ డబ్బింగ్ మూవీ ఫర్హానాకు డీసెంట్ టాక్ ఉన్నా ఈ అమ్మాయిని ఓటిటిలో చూద్దాంలే అనుకునే బాపతే ఎక్కువ. తక్కువ గ్యాప్ లో అయిదారు సినిమాలతో వస్తే ఇలాగే ఉంటుంది. కథ వెనుక కథ, టీ బ్రేక్, ది స్టోరీ అఫ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్, కల్యాణమస్తులు కూడా ఈరోజే వచ్చాయి. ఇవెప్పుడు తీశారనే డౌట్ వస్తే మీరు నిజమైన మూవీ లవర్ కానట్టే. కనీసం సరైన పబ్లిసిటీకి నోచుకోలేని చిన్న సినిమాలు థియేటర్ అద్దెలు కూడా వసూలు చేయలేనంత దీనస్థితిలో ఉన్నప్పుడు విడుదల వల్ల దక్కే ప్రయోజనం ఏంటి.

ఈ వరద తాకిడి ప్రాధమిక కారణం ఓటిటి కండీషన్లే. థియేటర్ రిలీజ్ అయితే తప్ప కొనమని తెగేసి చెప్పడం వల్ల నిర్మాతలు విధి లేక అదనపు ఖర్చులు వేసుకుని మరీ రిలీజ్ చేసుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల మంచి రేట్ ఇచ్చి కొంటారని గ్యారెంటీ లేదు. ఫ్లాప్ అయితే ఆటోమేటిక్ గా ధర మారిపోతుంది. కేవలం పబ్లిసిటీ నిర్మాణ సంస్థ నుంచి చేయించి రివ్యూలను విశ్లేషించి రేట్ డిసైడ్ చేయడానికి ఓటిటిలు ఆడే గేమ్ గా నిర్మాతలు మాట్లాడుకోవడం తెలిసిన విషయమే. అవసరాలు ఆధిపత్యం చెలాయించే పరిశ్రమలో ఇంతకు మించి వేరే మార్గం లేదని వాళ్లకూ తెలుసు. ఇది ఇప్పట్లో పరిష్కారం లేని సమస్యే.

ADVERTISEMENT
Latest Stories