
ముఖ్యమంత్రి, మంత్రి పదవి దక్కలేదని బాధపడుతుంటే అర్థం చేసుకోవచ్చు. ఎంపీ, ఎమ్మెల్యే టికెట్స్ లభించలేదని బాధపడినా అర్థం చేసుకోవచ్చు. మేయర్, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ పదవులు దక్కకపోయినా వారి బాధని అర్థం చేసుకోవచ్చు. కానీ డివిజన్, వార్డు మెంబరుగా పోటీ చేసేవారు ఆత్మహత్య చేసుకుంటే? అదీ… టికెట్ లభించక కాదు… ప్రత్యర్ధుల ఒత్తిళ్ళు, వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంటే?
తెలంగాణ మున్సిపల్ ఎన్నికలలో ఇదే జరిగింది. నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో ఆరో వార్డులో కౌన్సిలర్‌గా పోటీ చేస్తున్న బిజేపి అభ్యర్ధి మహాదేవప్ప (48) ఈ రోజు తెల్లవారుజామున తన ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు
బుధవారం పోలింగ్ జరుగబోతోంది. పోలింగ్ ముందు రోజు నేడు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రత్యర్ధుల వేధింపులు భరించలేకనే తన భర్త ఆత్మహత్య చేసుకున్నారని భార్య సత్తెమ్మ పోలీసులకు పిర్యాదు చేశారు.
తెలంగాణ బిజేపి అధ్యక్షుడు రామచందర్ రావు అధికార కాంగ్రెస్ పార్టీకి వార్నింగ్ ఇచ్చారు. తమ అభ్యర్ధిని వేధించినవారిని తక్షణం పార్టీ నుంచి బహిష్కరించి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికలలో కనిపించే ఈ స్థాయి ఒత్తిళ్ళు, వేధింపులు ఇప్పుడు గ్రామాలలో వార్డు మెంబర్ స్థాయికి కూడా వచ్చేయడం చాలా ఆందోళనకరమే. మనుషులు ప్రాణాలు తీసుకునేంతగా రాజకీయాలు దిగజారిపోయాయని స్పష్టమవుతోంది.
రాజకీయపార్టీల మద్య పోటీ పెరిగిపోవడం వల్లనే ఇలాంటి చిన్న పదవులపై కూడా ఒత్తిడి పెరిగిపోయిందని చెప్పవచ్చు. నయాన్నో భయన్నో ప్రత్యర్ధులను బరిలో నుంచి తప్పించేందుకు అవి చేస్తున్న ప్రయత్నాలలో ఈవిధంగా నిండు ప్రాణాలు బలైపోతున్నాయి.
తన ప్రాణం తీసుకున్న రాజకీయ పార్టీలకు పెద్దగా తేడా ఏమీ ఉండదు. అవి యధాప్రకారం రాజకీయాలు చేసుకుంటూనే ఉంటాయి కదా? ప్రాణాలు బలిగొనే రాజకీయాలు అవసరమా?లేదా రాజకీయ ఒత్తిళ్ళతో ప్రాణాలు తీసుకోవడం అవసరమా? అని మహాదేవప్ప ఆలోచించి ఉంటే ఆయన ఇలాంటి నిర్ణయం తీసుకునేవారు కారు. అయన కుటుంబం రోడ్డున పడేది కాదు కదా!
NTR fans are growing anxious about Trivikram’s ambitious mythological project, tentatively titled God of War,…
Team India started the T20I series against West Indies with a complete performance in Lucknow.…