గతంలో ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అటు తెలంగాణ ప్రభుత్వం రైతు రుణమాఫీ ప్రకటించగా, కేంద్రం నుండి ఎటువంటి సహాయం లభించలేదు. కనీసం రుణాలను రీషెడ్యూలు చెయ్యమన్నా ఒప్పుకోలేదు. పైగా రుణమాఫీ వల్ల రైతులకు ఎటువంటి మేలు జరగదని, దాని వల్ల లేని పోనీ ఇబ్బందులు వస్తాయని ఢిల్లీ నుండి గల్లీ దాకా ఆ పార్టీ నాయకులు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చేవారు.
[m9ad]
అయితే ఇదంతా గతం. ఇప్పుడు తెలంగాణాలో అధికారంలోకి రావడం కోసం అదే తెలంగాణ బీజేపీ రైతు రుణమాఫీ అంటూ చిలకపలుకులు పలుకుతుంది. తాము అధికారంలోకి వస్తే రెండు లక్షలకు వరకు ఉన్న రుణాలను మాఫీ చేస్తామని బీజేపీ తమ మేనిఫెస్టోలో పెట్టబోతుందంట.
దీనితో పాటు పాక్షిక మద్యపాన నిషేధం అమలు చేస్తామని కూడా పెట్టబోతున్నారట. పాక్షిక మద్యపాన నిషేధం విధిస్తే రాష్ట్రానికి ఉన్న ఆదాయ వనరులు తగ్గిపోతాయి. దానికి తోడు రైతు రుణమాఫీ అంటే మరి దానికి డబ్బు ఎక్కడ నుండి తెస్తారో? కేంద్రం ఏమన్నా సాయం చేస్తుందా? అసలు ఈ గొడవంతా బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి సంగతి కదా!



