Telugu

బీజేపీ ని భయపెడుతున్నదెవరు.? రాహుల్.? అభిజిత్.?

మా నిరసన కార్యక్రమాలతో బీజేపీ భయపడుతుంది అంటూ అటు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రకటనలు చేస్తున్న తరుణంలో మరోవైపు మా పిలుపుతో రోడ్ల మీదకొస్తున్న యువతను, జెన్ జీలను చూస్తూ మోడీ భయపడుతున్నారు అంటూ సీజేపీ ఫౌండర్ అభిజిత్ దూప్కే ఆరోపిస్తున్నారు.

అయితే ఈ ఇద్దరు ఆరోపణలలోను బీజేపీ భయపడుతుంది అనేది కామన్ పాయింట్ గా కనిపిస్తుంది. అయితే అసలు నిజంగా బీజేపీ ని బయపెడుతుందెవరు.? కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీనా.? కాక్రోచ్ జనతా పార్టీ అధ్యక్షుడు అభిజిత్ దూప్కే నా.?

ADVERTISEMENT

అభిజిత్ విషయానికొస్తే సీజేపీ చేపట్టిన నీట్ ఉద్యమం దేశ వ్యాప్తంగా ప్రజల దృష్టిని ఆకర్షించడంతో పాటుగా ప్రజా మద్దతును కూటగట్టుకుంది. దాని ఫలితంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర రాజీనామా కూడా జరిగింది. అయితే తాజాగా సర్ ప్రక్రియ కు వ్యతిరేకంగా సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోసం కూడా సీజేపీ బీజేపీ పై ఒత్తిడి చేస్తుంది.

జ్ఞానేశ్ రాజీనామా వరకు మా ఈ పోరాటం ఆగదు అంటూ ఎన్డీయే ప్రభుత్వానికి డెడ్ లైన్ లు, ప్రధాని మోడీ కి అల్టిమేటంలు జారీచేస్తుంది. ఈ నేపథ్యంలో సీజేపీ కి ఉన్న ట్రాక్ రికార్డు దృష్ట్యా బీజేపీ, సీజేపీ నిరసనలకు భయపెడుతుందా.? అన్న చర్చకు ఆస్కారం ఉంది.

ఇక కాంగ్రెస్ విషయానికొస్తే రాహుల్ నాయకత్వాన బీజేపీ కి వ్యతిరేకంగా, ఎన్డీయే టార్గెట్ గా ఇండి కూటమి చేస్తున్న రాజకీయం బీజేపీ కి కొత్తేమి కాదు. వాటిని ఎలా అడ్డుకోవాలి.? ఎలా నిరువరించాలి.? కాంగ్రెస్ నేతలకు ఎలా చెక్ పెట్టాలి అనే ఒక స్ఫష్టమైన ప్రణాళిక బీజేపీ కి అనుభవపూర్వకమే.

అయితే ఇక్కడ ఇటు సీజేపీ, అటు ఇండి కూటమి ఇద్దరు ఒకేసారి బీజేపీ పై పొలిటికల్ ఎటాక్ కు దిగడంతో బీజేపీ వేసే ఒక్క వెనకడుగు కూడా రెండు పార్టీలకు విజయం చేకూర్చినట్టే, ఆ ఇద్దరి నేతలకు రాజకీయ లబ్దిని అందించినట్టే అవుతుంది. కాబట్టి ఈ సందర్భంలో బీజేపీ వేసే ప్రతి అడుగు అత్యంత కీలకం కానుంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

CJP Protest: Bollywood Star Detained, His Smile Triggers

The protest of the Cockroach Janata Party, also called CJP, against Chief Election Commissioner Gyanesh…

34 minutes ago

విపక్షాల విమర్శలకు వెంకయ్య సూటి ప్రశ్న…

బీజేపీ ఓట్ చోరీ అంటూ, సర్ ప్రక్రియ అప్రజాస్వామ్యం అంటూ ఇటు బీజేపీ పై అటు సీఈసీ జ్ఞానేశ కుమార్…

54 minutes ago