Telugu

పశ్చిమ బెంగాల్ లో దీదీ అధికారానికి బీజేపీ చితి పెట్టినట్టే…

పశ్చిమబెంగాల్ లో వరుసగా మూడు సార్లు తన TMC పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా కొనసాగుతూ నాలుగవసారి కూడా తనదే హావ అనుకున్న దీదీకి బీజేపీ షాక్ ఇవ్వబోతుందా అన్నట్టుగా పరిస్థితులు మారుతున్నాయి.

మార్నింగ్ ట్రెండ్స్ లో నువ్వా నేనా అన్నటుగా పశ్చిమబెంగాల్ లో మమతా టీఎంసీ – బీజేపీ తమ ఆధిపత్యాలను కొనసాగించాయి. కానీ వార్ వన్ సైడ్ అన్నట్టుగా ప్రస్తుతం 293 సీట్లకు గాను మమతా టీఎంసీ 112 స్థానాలలో ఆధిక్యంలో కొనసాగిస్తుంటే బీజేపీ 175 స్థానాలలో తన హావ కొనసాగిస్తుంది.

ADVERTISEMENT

దీనితో మమత పై బీజేపీ చేస్తున్న దశబ్దాల రాజకీయ పోరాటం చివరికి ఈ ఎన్నికలలో ఫలితం ఇచ్చినట్టు కనిపిస్తుంది. బీజేపీ ఆశించినట్టే పశ్చిమబెంగాల్ లో దీదీ యుగాన్ని ముగించనుంది. 15 ఏళ్ళ మమత పాలనా ప్రజా వ్యతిరేఖతను తీసుకువచ్చిందా.?

లేదా RG KAR మెడికల్ కాలేజీలో జరిగిన మెడికో స్టూడెంట్ దారుణ హత్య దేశం మొత్తాన్ని కదిలించింది. ఆ కేసు విషయంలో సీఎం గా మమతా తీసుకున్న నిర్ణయాలు దోషులకు అనుకూలంగా ఉన్నాయనే భావన సర్వత్రా వ్యక్తమయింది. ఆ మెడికో విద్యార్థి హత్య కూడా మమత TMC పై ప్రభావం చూపించి ఉండే అవకాశం కూడా లేకపోలేదు.

మొత్తానికి బొటాబొటిగా సాగిన బీజేపీ, టీఎంసీ ల మధ్య పోరు చివరికి బీజేపీ కి అనుకూలంగా మారింది. దీనితో మమతా నాల్గవసారి ముఖ్యమంత్రి కల కలగానే మిగిలిపోయే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. బీజేపీ అధికారంలోకి వస్తుంది కాబట్టి ఆ పార్టీ రాజకీయంతో ఇక పశ్చిమబెంగాల్ లో దాదాపు దీదీ యుగం దాదాపు ముగిసినట్టే అని చెప్పొచ్చు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

WC Winning Captain’s Career Flop? First India, Now Nowhere

Suryakumar Yadav’s career has taken another unexpected turn. After being left out of all three…

13 minutes ago

ఏపీ అభివృద్ధి వార్తలను అవినీతి కేసులు మింగేస్తున్నాయే!

అభివృద్ధి గురించి ఆలోచించాలంటే అమరావతి, పోలవరంతో సహా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మౌలిక వసతుల అభివృద్ధి, కొత్తగా ఏర్పాటవుతున్న పరిశ్రమలు,…

24 minutes ago