సాక్షిl కథనాలు : కాళ్ళ భేరమా…?కుళ్ళు రాజకీయం.!

తమ గెలుపు కోసం ఎవరినైనా అంతమొందితిస్తాం, ఆ నేరాన్ని ప్రత్యర్థులపై నెట్టస్తాం, సొంత కథనాలు వండేస్తాం, ప్రజలకు వేడిగా వడ్డిస్తాం… అంటూ కనీస విలువలు పాటించని సాక్షి కథనాలు రోజురోజుకి పాతాళానికి పడిపోతున్నాయి. సొంత బాబాయి మరణం మీద కూడా పొంతన లేని కథనాలు రచించిన సాక్షికి ఇంతకన్నా విలువలు ఉంటాయని ఆశించడం మన అత్యాశే అవుతుందేమో.

టీడీపీ – జనసేన కలిసి పోటీ చేస్తే వైసీపీ కి ఎదురయ్యే పరిస్థితులేమిటో 2014 ఎన్నికలలో రుచి చూసిన జగన్ అండ్ కో ఆ రెండు పార్టీల మధ్య ఏర్పడిన పొత్తు బంధాన్ని నిర్వీర్యం చేయడానికి మీడియా విలువలకు ధీరోదాకాలిచ్చేసి మరి వార్తలు ప్రచారం చేస్తుంది. టీడీపీ, జనసేన పార్టీల అధినేతలు ఎక్కడ ఈ బ్లూ మీడియాకు అవకాశం ఇవ్వకుండా క్షేత్ర స్థాయిలో రెండు పార్టీల నేతలను కలుపుకుంటూ ముందుకెళుతున్న తరుణంలో ఇక సొంత కథనాలనే నమ్ముకున్న సాక్షి మరో కొత్త వాదాన్ని తెర మీదకు తెచ్చింది.

ADVERTISEMENT

పవన్ కు చంద్రబాబు షాక్. కాళ్ళ బేరానికి వచ్చిన పవన్. పొత్తును వ్యతిరేకిస్తున్న పవన్ అభిమానులు… అంటూ ఏవేవో వార్తలు ప్రచారం చేస్తూ ఇరు పార్టీల మధ్య చిచ్చు పెట్టడానికి సిద్ధమయ్యింది. విషయానికి వస్తే..,తెలంగాణ ఎన్నికల పోటీలో నిలబడిన జనసేనకు అక్కడ డిపాజిట్లు కూడా రావట, అసలు జనసేనకు ఓటు బ్యాంకు పెరగకుండా చేసింది కూడా చంద్రబాబేనట.ఆంధ్రప్రదేశ్ లో జనసేనను దెబ్బకొట్టడానికే బాబు ఈ ఎత్తుగడ వేశారంటా. తెలంగాణలో కేవలం ఎనిమిది స్థానాలలో పోటీ చేసి కనీస ఓటు బ్యాంకు కూడా సాధించలేని జనసేనను ఏపీలో కూడా పరిమిత స్థానానికి కట్టడి చేసే ఉద్దేశంతో చంద్రబాబు కాంగ్రెస్ కు మద్దతు తెలిపి తెర వెనుక రాజకీయం చేసాడు అంటూ సాక్షిలో కథనాలు వండి వడ్డిస్తున్నారు.

మరి ఎవరి గెలుపు కోసం తెలంగాణలో వైసీపీ పార్టీ ఎన్నికల బరి నుండి తప్పకుందో, ఎవరి ఓటు షేర్ పెరగాలని ఆశించి డాం దగ్గర డ్రామాలు ఆడిందో కూడా చెపితే బాగుండేది అంటున్నారు టీడీపీ, జనసేన పార్టీల శ్రేణులు. అలాగే పవన్ కూడా ఇక చేసేదేమి లేక బాబు పెట్టిన షరతులకు లొంగిపోయి జనసేన పార్టీని నమ్ముకున్న నేతలను బాబు గెలుపు కోసం బలివ్వడానికి సిద్ధమయ్యారు అంటూ పవన్ పైన కూడా తమకు అలవాటైన విషం కక్కారు. అసలు రెండు పార్టీల అధినేతల మధ్య సీట్ల ప్రస్తావనే రాలేదని దానికి ఇంకా సమయం ఉందని ఏదైనా ఉంటే అందరికి చెప్పి అందరికి అమోగ్యకరమైన నిర్ణయాన్నే తీసుకుంటా అంటూ మొదటి నుంచి పవన్ తన పార్టీ నేతలకు, అభిమానులకు చెప్పుకుంటూనే వస్తున్నారు. అలాగే టీడీపీ పార్టీ కూడా పొత్తులు పెట్టుకుంటే పార్టీ నేతలు త్యాగాలకు సిద్ధంగా ఉండాలి అంటూ ప్రకటించింది.

ఈ పొత్తు పార్టీల వ్యక్తిగత స్వార్థం కోసం కాదని రాష్ట్ర క్షేమం ఆశించి తీసుకున్న నిర్ణయం కాబట్టి అందరు సహకరించుకుంటూ ముందుకు వెళ్లాలంటూ పవన్ పదేపదే తమ పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తున్నారు. ఈ క్రమంలో ఎక్కడా కూడా సీట్ల పంపకాలు ప్రస్తావనకు రాలేదు. కానీ ఇదంతా దగ్గరుండి పరిశీలించినట్టు సాక్షిలో కథనాలు మాత్రం ప్రచారమవుతున్నాయి. పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పడానికి నేనేమన్నా జోతిష్కుడినా అంటూ మాట దాటేసిన అంబటి గారి ప్రసంగాలు ప్రచారం చేయలేని సాక్షి ప్రతిపక్షల మీద తప్పుడు కథనాలతో ప్రజలను మభ్యపెట్టడానికి మాత్రం ముందు వరుసలో ఉంటుంది.

పొద్దున్న లేస్తే తప్పుడు వార్తలు రావడనికి నాకు మీ మాదిరి ఒక ఈనాడు లేదు, ఏబీఎన్ లేదు, టీవీ 5 లేదు అంటూ చిలక పలుకులు పలికే ముఖ్యమంత్రి జగన్ గారికి సాక్షిలో రాసే ఆత్మసాక్షి లేని కథనాలు కనపడవా?వినపడవా? ఇలా మీడియాలను అడ్డుపెట్టుకుని మరీ ఇంత కుళ్ళు రాజకీయమా? అంటూ నోరెళ్లబెడుతున్నారు జనసేన నేతలు. పొత్తు పెట్టుకుంటేనే ఇంతలా బయపడి తప్పుడు కథనాలను ప్రచారం చేస్తున్న ఈ మీడియా ఇక పొత్తు ప్రభావము మొదలైతే ఇంకెన్ని అడ్డగోలు రాతలు రాస్తుందో.!అందుకే టీడీపీ, జనసేన పార్టీలు ఎప్పటికప్పుడు ఈవార్తలపై ఒక కన్నేసి ఉంచి ఇవి ప్రజలలోకి వెళ్లకుండా జాగ్రత్త పడాలి.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

After A Big Break, Vallabhaneni Vamsi Is Back?

Andhra Pradesh politics got largely streamlined after the removal of YCP from power. Usually abusive…

31 minutes ago

నిరుద్యోగ సమస్య పెరిగిపోతున్నా రాజకీయాలతోనే కాలక్షేపం!

ట్రంప్ నిర్ణయాలు, ఇరాన్‌ యుద్ధ పరిణామాలు, హెచ్‌1బీ వీసాలు, గ్రీన్ కార్డుల జారీపై కొత్త ఆంక్షలు.. వీటన్నింటి ప్రభావం అమెరికాతో…

42 minutes ago