తమిళంలో సూపర్ హిట్టయిన బోగన్ చిత్రాన్ని రామ్ తాళ్లూరి తెలుగులో అందిస్తున్నారు. ఇప్పటికే అనువాద కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈరోజు ఉదయం సినిమాకు సంబంధించిన ట్రైలర్ ని కూడా విడుదల చేశారు. ఒక బ్యాంక్ దొంగతనం కేసును దర్యాప్తు చేస్తూ, ఆదిత్య అనే నిందితుడిని పట్టుకోవడానికి ప్రయత్నించే విక్రమ్ అనే పోలీసాఫీసర్ కథ ‘బోగన్’ చిత్రం.
ఈ చిత్రాన్ని ఎలా విడుదల చెయ్యాలి అనేదాని మీద ఆలోచన చేస్తున్నారు నిర్మాత. ఒకవేళ పరిస్థితులు అనుకూలిస్తే థియేటర్లలో విడుదల చేస్తారు. లేని పక్షంలో ఓటీటీల వైపు మొగ్గే అవకాశం ఉంది. అదే సమయంలో రెండు చోట్ల విడుదల చేస్తే ఎలా ఉంటుంది అనేదాని మీద కూడా సమాలోచనలు జరుగుతున్నాయట.
అయితే దానికి ఓటీటీలు సహకరించాలి. కరోనా సమయంలో చిన్న సినిమాలకు ఇది మంచి ప్రయోగమే అవుతుంది. ఈ నెల 15 నుండి సినిమా థియేటర్లు, ముల్టీప్లెక్స్లు 50% ఆకుపెన్సీ పై ఓపెన్ చేసుకోడానికి కేంద్రం పర్మిషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దానికి సంబంధించిన ఎస్ఓపీలను కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ ఇంకా వెల్లడించలేదు.
దీనిపై థియేటర్ ఓనర్ల రెస్పాన్స్ ఉంటుంది అనేది కూడా చూడాలి. ఇది ఇలా ఉండగా… ఎన్నో ఓటీటీలు ఇచ్చిన ఆఫర్లు కాదని థియేటర్లు ఓపెనింగ్ కోసం వెచ్చి చుసిన రామ్ తన తదుపరి చిత్రం రెడ్ ను అన్ని కుదిరితే దీపావళికి విడుదల చెయ్యాలని యోచిస్తున్నట్టు సమాచారం




