బాలయ్య ఎన్నాళ్లో వేచిన ఉదయం వచ్చేసింది

Boyapati Srinu Is Back with a Killer Comboసింహా – లెజెండ్ సినిమాలతో బోయపాటి శ్రీను – బాలకృష్ణ కాంబినేషన్ కి ఎంతగా క్రేజ్ వచ్చిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. బాలకృష్ణ హీరోయిజాన్ని ప్రేక్షకులకు సరికొత్తగా చూపించి మాస్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు బోయపాటి. ఇప్పుడు వారి కాంబినేషన్ లో మూడవ సినిమా అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ లో మొదలు కాబోతుంది. 2020 వేసవి చివరి భాగంలో విడుదలకు సన్నాహాలు చేస్తుంది చిత్రబృందం.

ADVERTISEMENT

2019లో ఇప్పటివరకు బాలయ్యకు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ఈ సంవత్సరం వచ్చిన ఎన్టీఆర్ చిత్రం రెండు భాగాలు బాక్స్ ఆఫీసు వద్ద బోల్తా కొట్టాయి. అదే సమయంలో బాలయ్య హిందూపురం నుండి రెండో సారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ చిత్తుగా ఓడిపోయినా బాలయ్య తన 2014 మెజారిటీ కంటే ఎక్కువ మెజారిటీతో గెలవడం విశేషం. ఈ సంవత్సరంలో విడుదలై జై సింహా డైరెక్టర్ సినిమాపై అభిమానులకే పెద్దగా అంచనాలు లేవు.

దీనితో వారంతా ఈ సినిమా కోసం ఆసక్తిగా వేచిచూస్తున్నారు. ఈ మధ్య బోయపాటి టైం కూడా ఏమీ బాలేదు. వరుసపరాజయాలతో ఆయన సతమతం అవుతున్నారు. దీనితో ఈ సినిమా కోసం మరింత కసిగా పని చెయ్యబోతున్నారు. గతంలో బోయపాటి జయజానకి నాయక సినిమాను నిర్మించిన మిర్యాల రవీంద్రరెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమాలో న‌టించ‌బోయే ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు వివ‌రాల‌ను చిత్ర యూనిట్ ప్ర‌క‌టిస్తుంది

ADVERTISEMENT
Latest Stories