ఒకప్పుడు బ్రహ్మానందం ఉంటే చాలు… ఆ బొమ్మకు మినిమమ్ గ్యారెంటీ విజయం దక్కేది, ‘రేసుగుర్రం’ వంటి సినిమాలకు క్లైమాక్స్ లో వచ్చి ఆ సినిమాల ఫేట్ నే మార్చిన ఘనత బ్రహ్మి సొంతం. అలాంటి కమెడియన్ కింగ్, గత కొన్ని సంవత్సరాలుగా హాస్యాన్ని పండించడంలో విఫలమవుతున్నారు. ప్రేక్షకులకు కూడా బ్రహ్మి అంటే మొనాటిని వచ్చేసింది, దీంతో క్రమంగా సినిమాలు తగ్గుముఖం పట్టాయి.
[m9ad]
ఈ తరుణంలో తాజాగా బుల్లితెరపై ప్రత్యక్షం అవుతున్నారు. ఈ శనివారం నాటి నుండి ప్రారంభం కాబోతున్న ఈ కామెడీ షోకు సంబంధించిన అధికారిక ప్రోమో విడుదలైంది. సినిమా షూటింగ్ సెట్స్ పైన కూడా అందరినీ కడుపుబ్బా నవ్విస్తారని బ్రహ్మి గురించి సినీ వర్గాలు చెప్పే వ్యాఖ్యల్లో నిజమెంత ఉందో ఈ షో ద్వారా ప్రేక్షకులకు తెలియనుంది. సిల్వర్ స్క్రీన్ పైన అలరించిన మన హాస్యరత్న, స్మాల్ స్క్రీన్ పైన కూడా దున్నేస్తారని ఆశిద్దాం.



