“బ్రహ్మోత్సవం” 3 చక్రాల బైక్ ‘అడ్రస్’ దొరికింది!

brahmostavam 3 tyre bikeఇటీవల విడుదల చేసిన ‘బ్రహ్మోత్సవం’ సినిమా పోస్టర్లలో ప్రిన్స్ మహేష్ బాబు ఎక్కిన మూడు చక్రాల బైక్ సర్వత్రా హాట్ టాపిక్ అయ్యింది. స్టైలిష్ గాగుల్స్ తో ప్రిన్స్ డ్రైవ్ చేస్తున్న ఆ బైక్ పై యువత మనసు పారేసుకుంది. అయితే ‘బ్రహ్మోత్సవం’ సినిమా కోసం ప్రత్యేకంగా సదరు బైక్ ను డిజైన్ చేయించి ఉంటారని భావించిన సినీ అభిమానులకు చిత్ర యూనిట్ వర్గాల నుండి ఓ సమాచారం అందింది.

ADVERTISEMENT

ఉత్తరాదిన ‘బ్రహ్మోత్సవం’ సినిమా షూటింగ్ జరుపుతున్న సమయంలో చిత్ర యూనిట్ సభ్యులు ఒకరు ఈ బైక్ ను చూసి దర్శకుడిగా సలహా ఇచ్చారట. రాజస్థాన్ టూరిజంను పెంపొందించడం కోసం రూపొందించిన ఓ యాడ్ లో ఈ మూడు చక్రాల బైక్ దర్శనమివ్వడం.., ఆ బైక్ ను చూసిన వెంటనే దర్శక నిర్మాతలతో పాటు మహేష్ కు కూడా నచ్చడంతో… వెంటనే ఆ బైక్ తెప్పించడం… షూటింగ్ చేయడం వడివడిగా జరిగిపోయిందని యూనిట్ వర్గాల సమాచారం.

ప్రిన్స్ సృష్టించిన హంగామాతో ప్రస్తుతం ఆ రాజస్థాన్ టూరిజంకు సంబంధించిన యాడ్ సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఆయిల్ ట్యాంక్ పై రాసి ఉన్న అక్షరాల మొదలుకుని అన్ని ఒకేలా ఉండడంతో… సదరు బైక్ కు కాస్త హంగామా చేసి ‘బ్రహ్మోత్సవం’లో వినియోగించుకున్నట్లుగా అర్ధమవుతోంది. ‘బ్రహ్మోత్సవం’ సినిమాలో ఈ బైక్ విజువల్ ఓ పాటలో వస్తుందని సమాచారం.

Brahmotsavam Motion Poster

ADVERTISEMENT
Latest Stories