‘సర్ధార్’ రికార్డును బద్దలు కొట్టిన ‘బ్రహ్మోత్సవం’

brahmotsavam beats sardaar-gabbar-singhప్రస్తుతం తెలుగు సినిమా తన పరిధిని పెంచుకుంటోంది. స్థానిక మార్కెట్ తో పాటు దేశవిదేశాల్లో తెలుగు సినిమాలను ప్రదర్శించడానికి పోటీ నెలకొంటోంది. ఇది నిర్మాతల పాలిట వరంగా మారుతోంది. ఒకప్పుడు ఓవర్సీస్ అంటే యుఎస్ మార్కెట్ వరకే పరిమితం. అయితే గత దశాబ్ద కాలంలో తెలుగు సినీ పరిశ్రమలో ఏర్పడిన పరిణామాలు కొత్త మార్కెట్ ను ఏర్పరచుకున్నాయి.

ADVERTISEMENT

లండన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాల్లోనూ తెలుగు సినిమా హక్కుల కోసం పోటీ పడుతున్నారు. ప్రధానంగా పెద్ద హీరోల సినిమాలకు డిమాండ్ ఏర్పడుతున్న నేపధ్యంలో… పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “సర్ధార్ గబ్బెర్ సింగ్” ఆస్ట్రేలియా హక్కులను దాదాపు 65 లక్షలు వెచ్చించి దక్కించుకున్నారు. అయితే ఈ రికార్డును ఆ సినిమా విడుదల కాకముందే ప్రిన్స్ “బ్రహ్మోత్సవం” బద్దలు కొట్టింది.

ఓవర్సీస్ లో మహేష్ బాబు సినిమాలకుండే క్రేజ్ తెలిసిందే. దీంతో “బ్రహ్మోత్సవం” ఆస్ట్రేలియా హక్కులను ఏకంగా 75 లక్షలతో దక్కించుకున్నట్లుగా సమాచారం. చూడబోతుంటే మరికొద్ది రోజుల్లోనే ఆస్ట్రేలియా మార్కెట్ కూడా కోటి రూపాయల మార్కెట్ గా అవతరించడం ఖాయంగా కనపడుతోందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఈ రెండు సినిమాల పరిస్థితి ఇలా ఉంటే, అల్లు అర్జున్ “సరైనోడు” సినిమా కూడా ఆస్ట్రేలియాలో 30 లక్షలు తెచ్చి పెట్టింది.

ADVERTISEMENT
Latest Stories