మహేష్ మూవీలో ‘హార్ట్ టచింగ్’ డైలాగ్స్ లీక్!

maheshbabu brahmotsavam firstlookశ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న “బ్రహ్మోత్సవం” చిత్ర షూటింగ్ ప్రస్తుతం ఊటీలో జరుగుతోంది. కుటుంబ కధా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన స్టిల్స్ ఫేస్ బుక్, ట్విట్టర్ లలో సందడి చేస్తున్నాయి. ఇటీవల కాలంలో అగ్ర సినిమాలు లీక్ ల బారిన పడటం సర్వ సాధారణమైపోయిన తరుణంలో… తాజాగా “బ్రహ్మోత్సవం” డైలాగ్స్ కూడా లీక్ అయ్యాయని, ఫ్యామిలీ ఎమోషన్స్ కు పెద్ద పీట వేసే శ్రీకాంత్ అడ్డాల మరోసారి అదే తరహాలో హార్ట్ టచింగ్ సంభాషణలతో కట్టిపడేయనున్నారని… మచ్చుకు ఈ డైలాగ్స్ అని ప్రచారం జరుగుతోంది.

1) నలుగురిలో ఉండటం అంటే… నీ ఇంట్లో నాలుగు గోడల మధ్య ఉండటం కాదు. నలుగురూ నిన్ను గుర్తించడం…
2) మంచితనం నీ పుట్టుమచ్చ అయితే… దొంగతనం, చెడ్డతనం నువ్వు పెట్టుకున్న మచ్చలు… ఏ మచ్చలు కావాలో నువ్వే డిసైడ్ చేసుకో…
3) సమస్యలు అలలు లాంటివి వస్తూ ఉంటాయి… పోతూ ఉంటాయ్… నువ్వు తీరంలా ఎప్పుడూ స్ట్రాంగ్ గా ఉండాలి.
4) సముద్రంలో నీరు, అసమర్థుడి దగ్గర డబ్బు ఎంతున్నా ప్రయోజనం ఉండదు…
5) ఫ్యామిలీ ప్రాణం లాంటిది. జాగ్రత్తగా చూసుకోవాలే గానీ, ఎక్కడ పడితే అక్కడ మధ్యలో వదిలేయకూడదు…

ADVERTISEMENT
Latest Stories