‘బ్రహ్మోత్సవం’ కధ బాగా అల్లారుగా..!

mahesh-movie-storyశ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న “బ్రహ్మోత్సవం” సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నెల 7వ తేదీన ఆడియో విడుదల కానుండగా, 20వ తేదీన సినిమా రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా విషయమై సోషల్ మీడియాలో ఓ ‘కధ’ హల్చల్ చేస్తోంది. మరి ఆ కధాకమామీషు ఏంటో చూద్దాం…

“ఉమ్మ‌డి కుటుంబానికి చెందిన మ‌హేష్ ఫ్యామిలీ ఎలాంటి క‌ల‌త‌లు లేకుండా చాలా సంతోషంగా జీవిస్తున్న తరుణంలో స‌డెన్‌గా మ‌హేష్ తండ్రి చ‌నిపోతాడు. తండ్రి అస్తిక‌ల‌ను కాశీలో క‌లిపేందుకు బయలుదేరిన మ‌హేష్‌కు రైలులో హీరోయిన్ స‌మంత‌ ప‌రిచ‌యం కావడం, తొలి చూపులోనే మహేష్ ను ప్రేమించి పెళ్లి చేసుకోమ‌ని వెంట‌ప‌డుతుంది.

ADVERTISEMENT

సమంత ప్రేమ‌ను తిర‌స్క‌రించిన మ‌హేష్‌, గ‌తంలోనే త‌న తండ్రి స్నేహితుడి కుమార్తె, ఎన్నారై అయిన కాజ‌ల్‌ను ప్రేమించిన‌ట్టు చెపుతాడు. అయితే కాశీ నుంచి వ‌చ్చాక మహేష్ మ‌దిలో స‌మంత జ్ఞాప‌కాలు మెదులుతుంటాయి. దీంతో త‌న మ‌న‌స్సులో మెదిలే స‌మంత‌ను పెళ్లి చేసుకోవాలా లేదా తాను గ‌తంలో ప్రేమించిన కాజ‌ల్‌ను పెళ్లి చేసుకోవాలా అనే డైలామాలో ఉన్న సమయంలో మహేష్‌కు పెద్ద షాక్ త‌గులుతుంది.

మహేష్ తండ్రి చివ‌రి కోరిక ప్ర‌కారం మ‌ర‌ద‌లు ప్ర‌ణీత‌ను పెళ్లి చేసుకోవాల‌న్న కండీష‌న్ పెడ‌తారు. చివ‌ర‌కు మ‌హేష్ తండ్రి చివ‌రి కోరిక ప్ర‌కారం మ‌ర‌ద‌లు ప్ర‌ణీత‌ను పెళ్లి చేసుకున్నాడా లేదా తన‌ను ప్రేమిస్తున్న స‌మంత‌ను పెళ్లి చేసుకున్నాడా లేదా తాను ప్రేమించిన కాజ‌ల్‌ను పెళ్లి చేసుకున్నాడా? అన్న‌దే “బ్ర‌హ్మోత్స‌వం” స్టోరీ. ఎలా ఉంది అబ్బాయిలు ఈ కధ. ఇంతకీ ఇది నిజమో కాదో గానీ… పెద్ద సినిమాల విడుదలకు ముందు ఇలాంటి కధలు సందడి చేయడం షరామామూలే.

ADVERTISEMENT
Latest Stories