ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేస్తున్న ప్రచారంతో ఆంధ్రప్రదేశ్ తో పాటు రాజధాని అమరావతిలోనూ పెట్టుబడులు పెట్టడానికి విచ్చేస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇప్పటికే పలు ఒప్పందాలు ముగియగా తాజాగా అమరావతిలో వైద్యవిశ్వవిద్యాలయం ఏర్పాటుకు బ్రిటన్ సంస్థలు ముందుకొచ్చాయి.
1000 పడకలతో ఒక భారీ విశ్వవిద్యాలయాన్ని దాదాపు 150 ఎకరాల్లో నిర్మించేందుకు ఇండో – యుకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అనే బ్రిటన్ సంస్థ ఈ రోజు విశాఖలో చంద్రబాబు సమక్షంలో ఒప్పంద పత్రాలపై సంతకాలు జరగనున్నాయి. దీనికి అయ్యే మొత్తం ఖర్చు బ్రిటన్ నుండే వచ్చే విధంగా చర్చలు జరిగాయి.
అయితే ఏపీ ప్రభుత్వం తరపున 30 ఎకరాల విస్తీర్ణాన్ని ఈ విద్యాలయానికి కేటాయిస్తామని సదరు సంస్థ ప్రతినిధులతో చెప్పినట్లుగా సమాచారం. దేశంలో మొత్తం 11 సంస్థలను ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్న అదరు సంస్థ ఏపీని కూడా ఎంచుకుని, అందులో రాజధాని ప్రాంతాన్ని ఉంచుకోవడం విశేషం. చూడబోతుంటే చంద్రబాబు చేసిన విదేశీ టూర్ల ప్రభావం ఈ ఏడాదిలో కనపడుతోందని విశ్లేషకులు వ్యక్తపరుస్తున్న అభిప్రాయం.





