
తెలంగాణ రాజకీయాలలో అటు అధికార కాంగ్రెస్ కి ఇటు ప్రతిపక్ష బిఆర్ఎస్ కి మధ్య జరుగుతున్న రాజకీయ రచ్చలో “సిట్” కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ సిట్టే బిఆర్ఎస్ నేతలను ఎర్రవల్లి కేసీఆర్ ఫేమ్ హౌస్ లో “సిట్టింగ్’ చేయించింది.
గత రెండు రోజులుగా ఫోన్ టాపింగ్ కేసు విచారణ నిమిత్తం బిఆర్ఎస్ కీలక నేతలు హరీష్, కేటీఆర్ సిట్ ముందు హాజరు కావడంతో, అసలు విచారణలో అధికారులు ఏఏ ప్రశ్నలు సంధించారు.? నాయకులు ఎటువంటి జవాబులు చెప్పారు.? ఈ కేసులో పార్టీ పరిస్థితి ఎలా ఉంది.?
ఇటువంటి తరుణంలో తెలంగాణలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ పోటీ పరిస్థితి ఎలా ఉండబోతుంది.? అన్న అంశాల మీద పార్టీ అధినేత కేసీఆర్ తో భేటీ అయ్యేందుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ ఎర్రవల్లి కేసీఆర్ ఫామ్ హౌస్ కి చేరుకోనున్నారు.
అలాగే ఈ ముగ్గురు భేటీలో మరికొంతమంది కీలక బిఆర్ఎస్ నేతలు కూడా పాల్గొనబోతున్నట్టు సమాచారం. కేసుల పేరుతో, విచారణల సాకుతో రేవంత్ సర్కార్ బిఆర్ఎస్ బ్రాండ్ ని కించపరచాలని చూస్తున్నట్టు ఇప్పటికే కేటీఆర్ ప్రభుత్వం మీద వారి ఆదేశాలు అమలు చేస్తున్న అధికారుల మీద బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్నారు.
ఒకపక్క ప్రభుత్వం కేసులు, విచారణలంటూ పార్టీ నేతల పై ఒత్తిడి చేస్తుంటే, మరోపక్క పక్కలో బల్లెం మాదిరి కవిత తన విమర్శలతో పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఇటువంటి సమయంలో బిఆర్ఎస్ వేసే ప్రతి అడుగు అత్యంత జాగ్రత్తగా ఉండాలి.
లేకుంటే అందుకు పార్టీ మరోసారి రాజకీయంగా భారీ మూల్యాన్ని అందుకోవాల్సి ఉంటుంది. ఈ తరుణంలో అసలు బిఆర్ఎస్ స్థానిక సంస్థల ఎన్నికల బరిలోకి దిగి అధికార పార్టీని ధీటుగా ఎదుర్కోగలుతుందా.? లేదా ఉపఎన్నికల మాదిరి పార్టీ పరువు పోగొట్టుకుంటుందా.? అనేదాని పై ఈ ముగ్గురు నేతల సిట్టింగ్ జరగబోతుంది. మరి ఎన్నికల బరా.? బొయికాటా.?
NTR fans are growing anxious about Trivikram’s ambitious mythological project, tentatively titled God of War,…
Team India started the T20I series against West Indies with a complete performance in Lucknow.…