Telugu

మాక్ అసెంబ్లీలో కూడా చంద్రబాబుపై ఏడ్పులేనా?

బీఆర్ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేలందరినీ ఈ శాసనసభ సమావేశాలు ముగిసేవరకు సభ నుంచి సస్పెండ్ చేయడంతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం చల్లబడింది. కనుక ఊసుపోక కాలక్షేపానికి నేడు మాక్ అసెంబ్లీ పెట్టుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు.

మాక్ అసెంబ్లీలో బీఆర్ఎస్‌ నేతలే కాంగ్రెస్‌ మంత్రుల పాత్ర పోషిస్తూ “మా దిక్కుమాలిన ప్రభుత్వం పని తీరు ఇంతే.. చంద్రబాబు నాయుడు ఇచ్చిన డబ్బుతో, వారి సోషల్ మీడియా సహాయ సహకారంతో అధికారంలోకి వచ్చాడు. కనుక ఆయన ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేస్తాడు.

ADVERTISEMENT

ఆయన ప్రధాని మోడీతో మాట్లాడి మా ముఖ్యమంత్రిని మీ నుంచి కాపాడుతూ ఉంటాడు..,” అని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పాత్ర చేసిన బీఆర్ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి వ్యంగ్యంగా అన్నారు. అయన మాటలకు మాక్ అసెంబ్లీలో బీఆర్ఎస్‌ నేతలందరూ హాయిగా నవ్వుకున్నారు.

అయితే ఇదివరకు తమ అధినేత కేసీఆర్‌ చంద్రబాబు నాయుడుని గద్దె దించడానికి జగన్‌కు ఏవిధంగా సాయపద్దారో అందరూ మరిచినట్లున్నారు. అప్పుడు జగన్‌ కూడా అమరావతిని పాడుబెట్టేసి, పోలవరం పనులకు బ్రేకులు వేసి, పరిశ్రమలు, పెట్టుబడులు తెలంగాణకు సమర్పించుకొని కేసీఆర్‌కు గురు దక్షిణ చెల్లించుకున్నారు కదా?

నాడు కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి, జగన్‌ని రమ్మంటే వెళ్ళి బటన్ నొక్కి వచ్చారు కదా?నేటికీ బీఆర్ఎస్‌ పార్టీ నేతలు కృష్ణాగోదావరి నీళ్ళ విషయంలో పేచీలు పెడుతుంటే, జగన్‌ ఒక్కసారి కూడా వారి మాటలను ఖండించడం లేదు కదా?

కేసీఆర్‌-జగన్‌లది గురు శిష్యుల అనుబంధం కాగా జగన్‌-కేటీఆర్‌లది అన్నదమ్ముల అనుబంధం. కనుక తమ బంధం వారికి తప్పుగా అనిపించదు.

కానీ కనీసం ఏడాదికి ఒక్కసారి కూడా కలుసుకొని చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిలు తెలంగాణ ద్రోహులు! రేవంత్ రెడ్డిని, బిజేపిని ఎదుర్కోలేక చీటికి మాటికి చంద్రబాబు నాయుడుని విమర్శిస్తుంటారు. దీనిని బీఆర్ఎస్‌ పార్టీ నేతలు గొప్ప మాటకారితనంగా భావిస్తుంటారు. కానీ ప్రజలు దానిని అహంభావంగా భావిస్తూ కేసీఆర్‌ అంతటి వాడిని నిర్దాక్షిణ్యంగా గద్దె దించేశారు కదా?

అయినా అక్కడ వారి తీరు మారలేదు. ఇక్కడ వారి మిత్రుల తీరూ మారలేదు. కనుక వీటన్నిటికీ లెక్కకట్టి మరోసారి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వక తప్పదేమో?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

GV Prakash Is Winning on Both Sides in 2026

GV Prakash is having the kind of year that can easily be called a golden…

7 minutes ago

చిన్న శ్రీను గురించి ముందే తెలుసన్నప్పుడు కన్నీళ్ళు దేనికి?

ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలలో చిరకాలం కలిసి పని చేసిన ఉద్యోగుల మద్య అనుబందం ఏర్పడటం, ఒకరు వెళ్ళిపోతుంటే మిగిలినవారు బాధ…

37 minutes ago