“పెద్ది” రిలీజైనప్పటినుండి సినిమాలో ఉన్న పాజిటివ్ పాయింట్స్ కంటే నెగిటివ్ పాయింట్ అయిన జాన్వీ క్యారెక్టర్ విపరీతంగా హైలైట్ అవ్వడం చూస్తూనే ఉన్నాం. ఫెమినిస్టులైతే “2026లో కూడా ఇలాంటి సినిమాలు వస్తున్నాయా?” అని రీల్స్ & పోస్టులతో సినిమాని ఎక్కి తొక్కుతున్నారు. రిలీజ్ రోజు వరకు సదరు సన్నివేశాల విషయంలో చాలా మొండిగా ఉన్న బుచ్చిబాబు ఇప్పుడు తన తప్పు రియలైజ్ అయ్యాడు.
“ఒక దర్శకుడిగా సినిమా ఇన్స్పైర్ చేసే విధంగా ఉండాలి తప్పితే, ఎవర్నీ తక్కువ చేసేలా ఉండకూడదు అనేది నేను బలంగా నమ్ముతాను. ముఖ్యంగా మహిళలంటే నాకు విశేషమైన గౌరవం, ఈ సినిమాలో వారి సెంటిమెంట్స్ ఏమైనా హర్ట్ అయ్యుంటే క్షమాపణ చెబుతున్నాను, అంతేకాదు ఆ సన్నివేశాల్ని కూడా ట్రిమ్ చేస్తున్నా. మీ అభిప్రాయాలు నిజాయితీగా పంచుకున్నందుకు కృతజ్ఞతలు” అంటూ ట్విట్టర్ వేదికగా క్షమాపణలు చెప్పడమే కాక.. ఆ సన్నివేశాల్ని కట్ చేస్తున్నట్లు కూడా ప్రకటించాడు బుచ్చిబాబు.
నిజానికి.. “పెద్ది” సినిమాలో ఉన్న అసలైన సమస్య సరైన ఎమోషనల్ డెప్త్ లేకపోవడం, క్యారెక్టర్ ఆర్క్స్ కొరవడడం. కానీ.. సోషల్ మీడియా మొత్తం జాన్వీ కపూర్ ఎక్స్ పోజింగ్ మీద కాన్సంట్రేట్ చేసి, అసలెప్పుడూ తెర మీద హీరోయిన్ల ఎక్స్ పోజింగ్ చూడలేదన్నట్లు హడావుడి చేస్తున్నారు. మరి ఇప్పుడు సదరు ఫెమినిస్టులు బుచ్చిబాబు క్షమాపణలు అంగీకరించి, సినిమాను ఆదరిస్తారా? లేక ఇంకా అదే పట్టుకుని సోషల్ మీడియాలో ట్రోలింగ్ కంటిన్యూ చేస్తారా? అనేది చూడాలి.
ఇకపోతే.. బుచ్చిబాబు ఈ ఫీడ్ బ్యాక్ ఏదో ముందే చరణ్ & కో నుండి తీసుకొని రిలీజ్ కి ముందే ఆ పోర్షన్స్ కట్ చేసి ఉంటే.. సినిమాకి ఎలాంటి డ్యామేజ్ ఉండేది కాదు. బుచ్చిబాబు పంతం ప్రేక్షకుల అభిప్రాయం ముందు ఓడిపోవడమే కాక.. సినిమాకి డ్యామేజ్ చేసింది. ముఖ్యంగా ఓవర్సీస్ ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాకి దూరంగా ఉండడానికి జాన్వీ కపూర్ క్యారెక్టర్ విషయంలో సోషల్ మీడియాలో జరిగిన రచ్చే కారణం. ఆ ఎఫెక్ట్ ఓవర్సీస్ కలెక్షన్స్ మీద గట్టిగా పడింది.
As a filmmaker, I believe cinema should entertain, inspire, and connect with audiences. It should never make anyone feel uncomfortable or disrespected. We have heard the feedback regarding certain scenes in Peddi and have taken it seriously.
I have always had immense respect for…
— BuchiBabuSana (@BuchiBabuSana) June 6, 2026




