
రాజకీయ పార్టీలు ఎన్నికలలో గెలిచి అధికారంలోకి రావడం కోసం అనేక హామీలు, పధకాలు ప్రకటిస్తుంటాయి. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవే వాటికి గుదిబండల్లా మారుతాయి.
ఉదాహరణకు తెలంగాణలో మహాలక్ష్మి, ఏపీలో స్త్రీశక్తి పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నాయి. ప్రభుత్వాలు, ఆర్టీసీ ఆర్ధిక పరిస్థితి బాగుంటే ఇదేమీ పెద్ద భారం కాదు.
కానీ అక్కడ బీఆర్ఎస్, ఇక్కడ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు లక్షల కోట్లు అప్పులు చేసినందున, ప్రభుత్వ ఆదాయంలో సగానికిపైగా ఆ అప్పులు, వడ్డీల చెల్లింపులకే పోతోంది.
రెండు రాష్ట్రాలలో ఆర్టీసీ పరిస్థితి దశాబ్దాలుగా దయనీయంగా ఉంది. ఇప్పుడీ మహిళా పధకాల వలన ఆర్టీసీ ఆదాయం సగానికి పడిపోయింది.
ఇదే సమయంలో అమెరికా-ఇరాన్ యుద్ధం వలన పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోయాయి. యుద్ధం మళ్ళీ మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కనుక పెట్రోల్, డీజిల్ ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. కనుక ఆర్టీసీపై భారం ఇంకా పెరిగింది.
ఈ భారాన్ని ప్రభుత్వమే భరిస్తోందని ప్రభుత్వ పెద్దలు చెప్పుకుంటున్నప్పటికీ నెలనెలా సకాలంలో ఆర్టీసీకి చెల్లింపులు చేయడం చాలా కష్టం.
కనుక ఈ పధకం అమలు అటు ప్రభుత్వాలకి, ఇటు ఆర్టీసీ సంస్థలకి కూడా పులి మీద సవారీ వంటివే. ఈ పధకాన్ని కొనసాగిస్తూ నానాటికీ పెరుగుతున్న ఈ ఆర్ధిక భారం భరించాలంటే చాలా కష్టం. అలాగని పధకం నిలిపేస్తే ముందుగా ప్రతిపక్షాలు విమర్శలు, రాజకీయాలు మొదలుపెట్టేస్తాయి.
ఒకసారి ఉచిత ప్రయాణం అలవాటు చేసి దాని గురించి ఇన్ని గొప్పలు చెప్పుకొన్న తర్వాత నామమాత్రంగా ఛార్జీలు చెల్లించమని అడిగినా మహిళల ఆగ్రహానికి గురికావాల్సి ఉంటుంది. కనుక కష్టమైనా, నష్టమైన ఇలాంటి పథకాలను కొనసాగించక తప్పదు.
ప్రధాని మోడీ సూచన మేరకు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ కాన్వాయ్ సంఖ్య సగానికి తగ్గించుకున్నారు. సరే! కానీ మున్ముందు పెట్రోల్, డీజిల్ ధరలు ఇంకా పెరిగితే ఈ పధకం పరిస్థితి ఏమిటి? ఎటువంటి మార్పులు చేర్పులు చేయాలని రెండు ప్రభుత్వాలు ఇప్పటి నుంచే ఆలోచించుకుంటే మంచిదేమో?
Venkatesh’s much-hyped Aadarsha Kutumbam AK 47, directed by Trivikram, has been indefinitely postponed. Producer Naga…
The Ministry of External Affairs in India has amended the passport rules for minors of…