హనుమాన్ పై మొదలైన ప్రశంసలు..!

Celebrities Praising Hanu Man

కార్ల మధ్య సైకిల్ ను నడిపించాలనుకోవడం ప్రమాదకరం అంటూ హెచ్చరించిన వారికీ సైకిల్ పవర్ ఏంటో చూపించారు ప్రశాంత్ వర్మ. సినిమా ను తెరకెక్కించడంలో ఉన్న కాంఫిడెన్స్ సినిమాను ప్రమోట్ చేయడంలో కూడా కనపరిచి తన సినిమాను చిన్న చూపు చూసిన వారందరికీ తన సూపర్ హీరో పవర్ ఏంటో హనుమాన్ తో తెలియచేసారు దర్శకుడు ప్రశాంత్ వర్మ.

2024 సంక్రాంతి సూపర్ హీరోగా నిలిచిన హనుమాన్ సినిమా పై ప్రశంసల వర్షం కురిపించారు నందమూరి బాలకృష్ణ. హనుమన్-2 కోసం వెయిటింగ్ అంటూ దర్శకుడి తో సహా చిత్ర యూనిట్ కు అభినందనలు తెలియచేసారు బాలయ్య. కుటుంబసభ్యులతో కలిసి హనుమాన్ సినిమా చూసిన బాలయ్య సినిమా కన్నుల పండుగగా ఉంది, అందరు తమ క్రాఫ్ట్ వర్క్ కు పూర్తి న్యాయం చేసారంటూ నిర్మాత నిరంజన్ రెడ్డి, దర్శకుడు ప్రశాంత్ వర్మ ను అభినందించారు.

ADVERTISEMENT

అలాగే హనుమాన్ పై కన్నడ సినీ ప్రముఖులు సూపర్ స్టార్ శివన్న, కాంతారా ఫ్రేమ్ రిషబ్ శెట్టి సినిమా అద్భుతంగా ఉందంటూ సోషల్ మీడియాలో ట్వీట్ చేసారు. హీరో తేజ సజ్జతో కలిసి సినిమా చూసిన శివన్న తేజ యాక్టింగ్ బాగుందని, సినిమాలో అన్ని ఎమోషన్స్ ఉన్నాయంటూ చిత్ర యూనిట్ కు తన అభినందనలు తెలియచేసారు.

అలాగే రిషబ్ శెట్టి దర్శకుడు ప్రశాంత్ వర్మ సినిమాను తెరకెక్కించిన విధానం అద్భుతంగా ఉందంటూ ‘జై హనుమాన్’ అంటూ హనుమాన్ సినిమా పై ప్రశంసలు కురిపించారు. ఇప్పటికైనా సొంతఇంటి కూర అద్భుతాన్ని టాలీవుడ్ ప్రముఖులు గుర్తిస్తారా..? అంటూ సోషల్ మీడియాలో కౌంటర్లు పేలుతున్నాయి.

ADVERTISEMENT
Latest Stories