చాందిని చౌదరి సినిమాలో బాబీ సింహా కీరోల్

Chandini Chowdary and Bobby Simha sci-fi film

తెలుగమ్మాయి చాందిని చౌదరి హీరోయిన్ గా ఓ సైన్స్ ఫిక్షన్స్ సినిమా తెరకెక్కుతోంది. సహచారి క్రియేషన్స్ బ్యానర్ లో సృజన గోపాల్ నిర్మిస్తున్న ఈ చిత్రం డార్క్ హ్యూమర్ జానర్ లో కూడా ఉండనుందట. సుశాంత్ యాష్కీ, వికాస్ కీలకపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి పవన్ & వికాస్ కలిసి దర్శకత్వం వహిస్తున్నారు.

తమిళ నటుడు బాబీ సింహా ఈ సినిమాలో ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. బాబీ సింహా ఈ సినిమాలో నటించనుండడం వలన సినిమాకి మంచి బజ్ క్రియేట్ అవ్వడమే కాక.. ఆడియన్స్ లో ఆసక్తి కూడా నెలకొంది. ఇండియన్ 2 సినిమాలో నటించి ట్రోల్ మెటీరియల్ అయిపోయాడు కానీ.. బాబీ సింహా నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్. ఇప్పటికే జిగర్తాండలో అతడి నటన చూస్తే.. ఎంత గొప్ప ఆర్టిస్టు అనిపించక మానదు.

ADVERTISEMENT

వచ్చే నెల షూటింగ్ మొదలుకానున్న ఈ చిత్రంలో ప్రముఖ కమెడియన్ జీవన్ కుమార్, పాపులర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అజయ్ ఘోష్ లు సపోర్టింగ్ రోల్స్ లో కనిపించనున్నారు. తెలుగుతోపాటు తమిళంలోనూ వరుస సినిమాలు చేస్తున్న చాందిని చౌదరికి ఈ సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో సాగే డార్క్ హ్యూమర్ సినిమా మంచి హెల్ప్ అవుతుంది అని ఆశిస్తోంది.

ADVERTISEMENT
Latest Stories